AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Mukunda Murari Episode October 5th, 2023: ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద.. కృష్ణపై పైచేయి సాధించిన ముకుంద..

నాకు ఆదర్శ్ రాడు అంటే ఆ బాధ తెలుస్తుంది అని అంటుంది ముకుంద. ఇంట్లో బంధువులున్నారు వాళ్ళ ముందు దిగులుగా ఉంటె బాగుండదు కదా .. ఇప్పుడు ఆదర్శ్ గురించి చెప్పవద్దు.. పండగ వెళ్లిన తర్వాత చెబుదాం అని మురారీ అంటే.. అలాగే కానివ్వు నీ మాట ఎప్పుడు కాదన్నాను .. పండగ అయిన తర్వాత ఈ విషయం చెప్పల్సిన బాధ్యత మన ఇద్దరి మధ్య ఉందన్న సంగతి గుర్తు పెట్టుకో అని మురారీని మిస్ లీడ్ చేస్తుంది ముకుంద. 

Krishna Mukunda Murari Episode October 5th, 2023: ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద.. కృష్ణపై పైచేయి సాధించిన ముకుంద..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2023 | 7:14 AM

కృష్ణ, మురారీలు వినాయక చవితి షాపింగ్ కు వెళ్తుంటే.. భవానీ ఆపి మురారీని ఆదర్శ్ గురించి తెలుసుకోమని చెప్పి ఒక అడ్రస్ ఇస్తుంది. కృష్ణ కూడా వెళ్తాను అంటే చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకో అంటుంది కృష్ణ. ముకుంద తాము వెళ్లకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిందిగా ఇదంతా కుట్రనా అనుకుంటూనే లేదు.. ఆదర్శ్ ని అడ్డుపెట్టుకోదు నిజమే అయి ఉంటుంది అని ఆలోచిస్తుంది కృష్ణ. ఆదర్శ్ జాడ చూపించి ముకుంద జీవితానికి ఒక దారి చూపించు అని భవానీ కోరుకుంటుంది.

పంతం నెగ్గించుకున్న ముకుంద

మురారీ బైక్ మీద వెళ్తుంటే.. రాత్రి కృష్ణకు బయటకు వెళ్దామని చెప్పను.. ఇప్పుడు ఇలా వెళ్తున్నా అనుకుంటుంటే.. ఇంతలో ముకుంద .. మురారీని ఆపి నేను కూడా వస్తాను అని అంటుంది ఎక్కడి అని అడిగితె మీ పెద్దమ్మ చెప్పలేదా ఆదర్శ్ గురించి ఎవరో సైనిక్ పురిలో ఉన్నారు అంట కదా.. అని అడిగితె.. ఇది ముకుంద ఆడిన నాటకం కాదు కదా అని అంటే. నేను వెళ్లి వస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటే భవానీకి ఫోన్ చేసి.. నేను ఆదర్శ్ కోసం గుడికి వెళ్ళి వస్తుంటే.. మురారీ ఎదురయ్యాడు.. నేను వస్తా అని అంటే వద్దు అంటున్నాడు అని భవానీ కి చెబితే.. మురారీతో తీస్కుని వెళ్లరా అని అంటుంది భవానీ ..

గణేష్ విగ్రహం కోసం వెళ్లిన ప్రభాకర్

ప్రభాకర్..సుక్కు లు కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అత్తయ్యకు వినాయకుడిని తీసుకొస్తాను అని చెప్పారట కదా ఎప్పుడు తీసుకుని వస్తారు అని అడుగుతుంది. ఇప్పుడే వెళ్లి గణపతి విగ్రహం తీసుకొస్తా అని వెళ్తాడు ప్రభాకర్.

ఆదర్శ్ కోసం వెళ్లిన మురారీ..

ఆదర్శ్ కోసం ఫుల్ డీటైల్స్ తెలుసుకున్నా అని అంటే.. ఏమి మాట్లాడారు అంకుల్ అంటుంది. ఆదర్శ్ సేఫ్ గానే ఉన్నాడు. మానసికంగా మాత్రం ఏదో తేడా ఉన్నాడు. అతను ఫోన్ మాట్లాడం లేదు.. కేవలం వాకీ టాక్ మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఆదర్శ్ వస్తాడన్న నమ్మకాన్ని మీరు వదిలేసుకుంటే మంచిది అని చెబుతాడు.

ముకుంద ప్లాన్ ఏమైనా ఉందా..

చిన్నాన్నని విగ్రహం తీసుకుని రమన్నారు .. కదా అని అంటుంటే.. ముకుంద కోసం అడిగితే అనుమానం వస్తుంది అని అనుకుంటే.. నేను మూడు రోజులు ఉండను ఆశ్రమానికి వెళ్తున్నా అని భవానీ కృష్ణకు చెబుతుంది.

మూడు రకాల భార్యలను అసలు నమ్మకండి..

క్రూరమైన భార్యలు, శాడిస్టు భార్యలు, అతిగా ఆవేశపడి భార్యలను నమ్మకండి.. అని ఓ రీల్ చేస్తాడు మధు. ఇంతలో అలేఖ్య వచ్చి ఆ వీడియో డిలీట్ చేయమని చెబుతుంది.

ముకుంద విజయానికి చెరువుగా వస్తుంది..

సైనిక్ పురి ముకుంద కూడా వెళ్తుంది. ఇదంతా ముకుంద చేసింది.. విజయానికి చెరువుగా వస్తుంది అని అలేఖ్య ఆనంద పడుతుంది. ఈ విషయం కృష్ణకు చెబితే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది అలేఖ్య..

రెస్టారెంట్ లో ముకుంద మురారీని చూసిన ప్రభాకర్..

ముకుంద మా నాన్న చెప్పిన ఒక విషయం గుర్తుకొస్తుంది బావిలో నీరు ఉన్నప్పుడు గుర్తుకు రావు.. ఎండిపోయినప్పుడే గుర్తుకొస్తాయి .. ఇప్పుడు నాకు ఆదర్శ్ రాడు అంటే ఆ బాధ తెలుస్తుంది అని అంటుంది ముకుంద. ఇంట్లో బంధువులున్నారు వాళ్ళ ముందు దిగులుగా ఉంటె బాగుండదు కదా .. ఇప్పుడు ఆదర్శ్ గురించి చెప్పవద్దు.. పండగ వెళ్లిన తర్వాత చెబుదాం అని మురారీ అంటే.. అలాగే కానివ్వు నీ మాట ఎప్పుడు కాదన్నాను .. పండగ అయిన తర్వాత ఈ విషయం చెప్పల్సిన బాధ్యత మన ఇద్దరి మధ్య ఉందన్న సంగతి గుర్తు పెట్టుకో అని మురారీని మిస్ లీడ్ చేస్తుంది ముకుంద.

గమ్మతైన జంట

అందమైన జంట అనడం విన్నాను.. అన్నోన్యమైన జంట అనడం విన్నాను.. కానీ గమ్మతైన జంట అని అనడం వినలేదు.. ఇంత మంచి చిన్ననతో ఎందుకు గొడవ అయింది. మా నాన్న స్ట్రిక్ట్.. ఈయనేమో జాలీ..మా నాన్నకు కోపం వచ్చి లారీ క్లినర్ గా చేయమంటే.. ఈయన ఏమో ఏకంగా 16 లారీలకు ఓనర్ అయ్యారు అని చెబుతుంది కృష్ణ.

ప్రసాద్ తో సుమ..

మీ ఫ్యామిలీ అంతా బాగుంది. కానీ ముకుంద కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను.. మొగుడు గురించి అడిగితె అంత కోపం వస్తుంది అని అంటే అలా ఉండదు.. అందరితోనూ మంచిగా ఉంటుంది. అని అంటే.. నా బిడ్డతో మాత్రమే అలా ఎందుకు ఉంటుంది ఈ ముచ్చట ఏదో నేను తేల్చుకుందాం అని సుక్కు అని అంటే .. ముకుంద ఏది అని అంటూ అలేఖ్య, మధు దగ్గరకు రేవతి కృష్ణ వస్తారు. నాకు తెలియదు అని అలేఖ్య చెబుతుంది.

రేపటి ఎపిసోడ్ లో

వినాయక చవితికి ముకుంద నాన్నని పిలవని అంటే.. అది జరిగే పని కాదు అని అంటుంది.. అప్పుడు కృష్ణ నేను జరిపిస్తా అని చెబుతుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..