Bigg Boss Telugu 7: ఇదేం ఓటింగ్‌ రా బాబు.. వార్ వన్‌సైడ్ చేసిన శివాజీ

ప్రియాంక, అమర్, శోభ ఒక బ్యాచ్. వాళ్లు బయటే మాట్లాడి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వారికి సందీప్ తోడయ్యాడు. ఇక తేజ.. ఆట ఆడాల్సింది పోయి శోభకు పెట్ మాదిరి అయిపోయాడు. ఇటు కసిగా ఆడే ప్రశాంత్, యావర్‌లకు మార్గనిర్దేశకుడు అయ్యాడు శివాజీ. అన్ అఫీషియల్ పోల్స్ ఎక్కడ చూసినా శివాజీకి గంప గుత్తగా ఓట్లు పడిపోతున్నాయి.

Bigg Boss Telugu 7: ఇదేం ఓటింగ్‌ రా బాబు.. వార్ వన్‌సైడ్ చేసిన శివాజీ
Shivaji
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 05, 2023 | 10:19 AM

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. దీంతో ఆట మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వాళ్లలో ఎక్కువమంది సీరియల్స్‌లో నటించేవారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆల్రెడీ చిందరవందర గేమ్ ఆడుతున్న స్టార్ మా బ్యాచ్‌కు జత కూడతారో.. లేదా దుమ్ము లేపుతున్న శివాజీ టీమ్‌తో పొత్తు పెట్టుకుంటారో చూడాలి. బయట ఆట చూసి వస్తున్నారు కాబట్టి చాలామంది సాధ్యమైనంతవరకు ఈ సీజన్ స్టార్ శివాజీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. వారు ఎవరు సైడ్ ఉంటారు అన్నదాన్ని బట్టి బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది హౌస్ మేట్స్‌కి కూడా అర్థమవుతుంది. ఇకపోతే సంచనాలు జరక్కపోతే ఈ సీజన్ విన్నర్ శివాజీ అన్నది ఇప్పటివరకు ఎపిసోడ్స్ చూసిన జనాలు చెప్తున్న మాట. ఆయన అంత గొప్పగా ఆడుతున్నారా అంటే.. నాట్ బ్యాడ్ అని చెప్పాలి. ఆయన స్థాయికి తగ్గట్లుగా ఆడేవాళ్లు, స్ట్రాటజీలు వేసేవాళ్లు అక్కడ మచ్చుకకు కూడా ఒక్కరూ లేరు.

ప్రియాంక, అమర్, శోభ ఒక బ్యాచ్. వాళ్లు బయటే మాట్లాడి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వారికి సందీప్ తోడయ్యాడు. ఇక తేజ.. ఆట ఆడాల్సింది పోయి శోభకు పెట్ మాదిరి అయిపోయాడు. ఇటు కసిగా ఆడే ప్రశాంత్, యావర్‌లకు మార్గనిర్దేశకుడు అయ్యాడు శివాజీ. అన్ అఫీషియల్ పోల్స్ ఎక్కడ చూసినా శివాజీకి గంప గుత్తగా ఓట్లు పడిపోతున్నాయి. ఏకంగా 50 శాతం ఓట్లు పడేలా చేసుకుంటూ సింహనాదం చేస్తున్నారు శివాజీ. నిజాయితీగా ఆడాల్సిన చోట నిజాయితీగా ఉండటం.. స్ట్రాటజీలు వాడాల్సిన చోట.. స్ట్రాటజీలు వాడటం.. తప్పును సూటిగా ప్రశ్నించడం.. అనవసర విషయాల్లో వేలు పెట్టకపోవడం వంటి అంశాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి.

శివాజీ లేకపోయి ఉంటే.. పాపం తెలుగు తెలియని ఆ యావర్‌ను, పెద్దగా మసులుకోవడం తెలియని ప్రశాంత్‌ను చెడుగుడు ఆడేసేవారు. ఆ అమర్ ఏంటో.. ఏం ఆడుతున్నాడో.. ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావడం లేదు. ఏదో బయట ఇమేజ్ వల్ల నెగ్గుకు వస్తున్నాడు తప్పితే.. ఇప్పటివరకు పెద్దగా పొడిచింది ఏం లేదు. ఇక శోభా ఓవరాక్షన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఇష్యూలో ఓవర్ ల్యాప్ చేస్తూ.. ఆడియెన్స్‌కు నసలా మారింది. ఇక గౌతమ్‌ జెంటిల్ మ్యాన్‌లా బిహేవ్ చేస్తున్నా.. అతనికి పలు విషయాలపై క్లారిటీ లేదు. సుబ్బూ మాత్రం పర్లేదు అనే చెప్పాలి. మంచిగానే గేమ్ ఆడుతుంది. మొత్తంగా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట మారిపోయే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..