Sharan Navaratri: నవరాత్రుల్లో ఈ శక్తి పీఠంలోని అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదం.. భారీ సంఖ్యలో భక్తులు

కోవిడ్ తర్వాత అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా భక్తులకు స్వాగతం పలికేందుకు ఆలయ యంత్రాంగం సిద్ధమైంది. ఆలయానికి రంగులను వేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాత్యాయనీ దేవిని అలంకరించడానికి ప్రతిరోజు భారతదేశం, విదేశాల నుండి వచ్చిన పూలతో అలంకారం చేస్తున్నారు. అదే సమయంలో ప్రతి రోజు అమ్మవారి అలంకారం కోసం వివిధ దుస్తులు, అందమైన చీరలు, లెహంగా దుస్తులు కూడా సిద్ధం చేశారు

Sharan Navaratri: నవరాత్రుల్లో ఈ శక్తి పీఠంలోని అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదం.. భారీ సంఖ్యలో భక్తులు
Katyayani Shakti Peeth
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2023 | 11:49 AM

నవరాత్రుల్లో ఆరో రోజు దుర్గాదేవిని కాత్యాయని రూపంలో పూజిస్తారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ లక్షలాది మంది అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి ఆలయాలను దీపాలతో అలంకరించిన ఆలయంలో ప్రతిరోజూ వివిధ సాంస్కృత కార్యక్రమాలను చేపడతారు. నేడు కాత్యాయని దేవిని పూజిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.

కాత్యాయనిదేవి ఆలయం ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో ఉంది. నవరాత్రులలో కాత్యాయని దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వస్తారు. మెట్రో లేదా బస్సు ద్వారా ఢిల్లీలోని ఏ మూల నుండి అయినా ఛతర్‌పూర్ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఛతర్‌పూర్ మెట్రో స్టేషన్‌లో దిగి కాలినడకన ఆలయానికి చేరుకోవచ్చు.

శక్తిపీఠం కాత్యాయనీ ఆలయం

ఈ కాత్యాయనీ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారిని దర్శించి.. నిర్మల హృదయంతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ఈ ఆలయం ఢిల్లీలోని హిందువులకు సంబంధించిన ఆలయాల్లో ప్రసిద్ధ ఆలయంగా పరిగణించబడుతుంది.ఇప్పటికే దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. సిద్ధపీఠం కాత్యాయనీ దేవి ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

దేశ, విదేశాల నుంచి తెచ్చిన పుష్పాలతో అమ్మవారి అలంకారం..

కోవిడ్ తర్వాత అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా భక్తులకు స్వాగతం పలికేందుకు ఆలయ యంత్రాంగం సిద్ధమైంది. ఆలయానికి రంగులను వేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాత్యాయనీ దేవిని అలంకరించడానికి ప్రతిరోజు భారతదేశం, విదేశాల నుండి వచ్చిన పూలతో అలంకారం చేస్తున్నారు. అదే సమయంలో ప్రతి రోజు అమ్మవారి అలంకారం కోసం వివిధ దుస్తులు, అందమైన చీరలు, లెహంగా దుస్తులు కూడా సిద్ధం చేశారు. అంతేకాదు అమ్మవారిని బంగారం, వజ్రాల ఆభరణాలతో అలంకరిస్తున్నారు.

ఆలయం వద్ద గట్టి భద్రత

ఈసారి నవరాత్రి ఉత్సవాలను కోవిడ్ కఠినమైన నియమాలు లేకుండా అత్యంత వైభవంగా జరుపుతున్నారు.  కాత్యాయని అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. భక్తులెవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వందలాది సీసీటీవీ కెమెరాలతో ఢిల్లీ పోలీసులు, వాలంటీర్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 100 మందికి పైగా ఢిల్లీ పోలీసులు 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు.

24 గంటలు తెరచి ఉండే ఆలయం

కాత్యాయనీ దేవి దేవాలయం నవరాత్రి సమయంలో 24 గంటలు తెరిచి ఉంటుంది. ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం పండుగలా జరుపుకుంటారు. ఆలయానికి దర్శనం కోసం వచ్చే వారికి భోజన, పానీయాల కోసం తగు ఏర్పాట్లు చేశారు. నవరాత్రులలో భండారాలు భక్తుల కోసం పనిచేస్తూనే ఉంటాయి. నవరాత్రులలో, లక్షలాది మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

కాత్యాయని దర్శనం.. పూజ ఫలితం

హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రుల్లో ఆరవ రోజున దుర్గాదేవి ఆరవ స్వరూపమైన కాత్యాయనీ దేవిని పూజించినా.. మంత్రం జపించినా, ఉపవాసం చేసినా లేదా దర్శనం చేసుకున్నా, ఆ దేవి అనుగ్రహంతో అతని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. ఎటువంటి భయం లేదా అడ్డంకి ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కాత్యాయనీ దేవిని ఆరాధించడం ద్వారా సాధకుడి జాతకంలో బృహస్పతి గ్రహం బలపడి ఆనందాన్ని,  అదృష్టాన్ని పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..