Astro Tips for Love: ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య గొడవలా.. శని, కుజ అనుగ్రహం కోసం ఈ చర్యలు చేసి చూడండి
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో 7 వ ఇల్లు ప్రేమ జీవితం విజయవంతమవుతుందా లేదా విఫలమవుతుందా అని చెబుతుంది. శని, కుజుడు, రాహువు లేదా కేతువు వంటి గ్రహాలు ఈ ప్రదేశంలో కనిపిస్తే.. ఈ గ్రహాలు భార్యాభర్తల సంబంధాలతో లేదా ప్రేమికుల మధ్య బంధంలో చీలికలకు కారణమని పేర్కొంది.
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ భాగస్వామి తమని గౌరవించాలని, ప్రేమించాలని కోరుకుంటారు. అయితే కొందరి విషయంలో కోరుకున్న ప్రేమ దొరకదు. తమ బంధాలు, సంబంధాలలో నిరంతరం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు సమస్యలు ఎంతగా పెరుగుతుందంటే.. ఆ సంబంధం తెగిపోయే స్థాయికి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు జాతకంలో గ్రహ దోషాలు ఉన్నా ప్రేమ పై ప్రభావం చూపించవచ్చు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో 7 వ ఇల్లు ప్రేమ జీవితం విజయవంతమవుతుందా లేదా విఫలమవుతుందా అని చెబుతుంది. శని, కుజుడు, రాహువు లేదా కేతువు వంటి గ్రహాలు ఈ ప్రదేశంలో కనిపిస్తే.. ఈ గ్రహాలు భార్యాభర్తల సంబంధాలతో లేదా ప్రేమికుల మధ్య బంధంలో చీలికలకు కారణమని పేర్కొంది. అటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక ఈ గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని జ్యోతిష్య నివారణ చర్యలు పాటించాల్సి ఉంది. తద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు సంబంధంలో చీలికలు రాకుండా తీసుకోవాల్సిన కొన్ని అద్భుత పరిష్కారాల గురించి తెలుసుకుందాం.
గ్రహాల అనుగ్రహం కోసం చేయాల్సిన పరిష్కారాలు
- కుజ దోషం నుండి విముక్తి పొందడానికి.. నియమాలను అనుసరిస్తూ పద్ధతి ప్రకారం కుజుడిని పూజించండి.
- మంగళవారం ఈ మంత్రాన్ని జపించండి:
- ”రక్తమాల్యాంబరధరః శక్తిశూల గదాధరః । చతుర్భుజం రక్త రోమా వరదః స్యాద్ ధరాసుతః
- అంటే నాలుగు చేతులు, ఎర్రటి జుట్టు గలవాడు, వరాలను ఇచ్చేవాడు, భూలోకపుత్రుడైన కుజుడికి నమస్కారం అని ఈ మంత్రాన్ని జపించండి.
- శనిదేవుని అనుగ్రహం పొందడానికి, శనివారం నాడు మీ భాగస్వామితో కలిసి శనీశ్వర దేవాలయానికి వెళ్లి శని దేవుడికి ఆవాల నూనెను సమర్పించండి.
- శనివారం నల్లని వస్త్రాలు దానం చేయండి.
- శనివారం నాడు నల్ల నువ్వులను నల్ల గుడ్డలో కట్టి నూనెలో ముంచి శనిదేవుని ముందు దీపం వెలిగించాలి.
- రాహువు, కేతువులను ప్రసన్నం చేసుకోవడానికి, పక్షులకు ఆహారం ఇవ్వండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.