Navaratri 2023: నేడు మూలా నక్షత్రం.. సరస్వతి అలంకారంలో అమ్మవారు.. ఇలా పూజ చేస్తే.. ఆగిన పనులు కూడా జరుగుతాయి..

హిందూమతం లో సరస్వతి దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ..  దేవేరి. వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. దేవీ నవరాత్రుల్లో , వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవిని ఆరాదిస్తారు. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు. 

Navaratri 2023: నేడు మూలా నక్షత్రం.. సరస్వతి అలంకారంలో అమ్మవారు.. ఇలా పూజ చేస్తే.. ఆగిన పనులు కూడా జరుగుతాయి..
Navaratrulu
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2023 | 8:27 AM

దసరా నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. నవరాత్రులలో నియమాలను అనుసరిస్తూ అమ్మవారిని పూజిస్తే దుర్గాదేవి అనుగ్రహం కుటుంబం మొత్తంపై ఉంటుంది. నవరాత్రుల ఆరవ రోజు మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతి దేవి, కాత్యాయని అలంకారాల్లో దర్శనం ఇవ్వబోతున్నారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి విశిష్టత స్థానం ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాశం కలుగుతుందని విశ్వాసం.

హిందూమతం లో సరస్వతి దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ..  దేవేరి. వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. దేవీ నవరాత్రుల్లో , వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవిని ఆరాదిస్తారు. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు.

సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం.. వీటన్నింటికీ అధిదేవత సరస్వతి. ఈ అమ్మవారు   హంసవాహిని, వీణాపాణిగా కీర్తించబడుతుంది.

సరస్వతి దేవికి ఇష్టమైన వర్గం తెలుపు. సరస్వతి దేవి చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. శ్వేత పద్మము నందు వీణ దండము కమండలము అక్షమాల ధరించి ఉంటుంది

ఉదయమే లేచి స్నానం చేసి.. గంగాజలంతో సుద్ధి చేసి అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసి దానిమీద సరస్వతి రూపంలో అమ్మవారిని అలంకరించాలి. తెలుపు రంగు వస్త్రాలను ధరించజేయాలి. సరస్వతీ దేవికి తాజా పండ్లు , పువ్వులు సమర్పించి.. పూజ అనంతరం నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇచ్చి.. ప్రసాదాన్ని భక్తులకు పంచాలి.

సరస్వతీదేవి మంత్రం..

సరస్వతి నమ స్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిధ్ధిర్భవతు మేసదా పద్మపత్ర విశాలక్ష్మీ పద్మకేసర వర్ణనీ నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ. అంటూ