Indrakeeladri: సరస్వతి అలంకారంలో దుర్గమ్మ.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. పోటెత్తుతున్న భక్తులు

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు దుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.15 కు ఇంద్రకీలాద్రి సీఎం చేరుకోనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం తో దుర్గమ్మను దర్శించుకోనున్నారు.    

Indrakeeladri: సరస్వతి అలంకారంలో దుర్గమ్మ.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. పోటెత్తుతున్న భక్తులు
Indrakeeladri Dasara
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2023 | 10:46 AM

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు దుర్గమ్మ వారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం దుర్గమ్మ జన్మ నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్య లో  ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. సరస్వతిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలి వస్తున్నారు. క్యూలైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.

ఇంద్రకీలాద్రి నేడు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు దుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.15 కు ఇంద్రకీలాద్రి సీఎం చేరుకోనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం తో దుర్గమ్మను దర్శించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

ఘాట్ రోడ్డువరకూ బారులు తీరిన భక్తులు

తెల్లవారుజామునే అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తి రూపాలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. భారీ సంఖ్యలో కొండకు చేరుకున్న భక్తులు అమ్మవారి దర్శనం కోసం వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్డువరకు బారులు తీరారు. భక్తుల రద్దీని స్వయంగా సీపీ కాంతి రాణా పర్యవేక్షిస్తున్నారు. రోప్ లతో భక్తులను కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేసిన అధికారులు వీఐపీల అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. నేడు భక్తుల రద్దీ దృష్ట్యా..  వృద్దులు, వికలాంగులు దర్శనానికి రావద్దంటూ అధికారుల సూచించారు. భక్తజనుల అగ్నానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయినీ సరస్వతి దేవి. సరస్వతి దేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకమని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..