Jackpot: ఎమిరేట్స్‌ డ్రాలో భారతీయుడికి జాక్‌పాట్‌ .. ఎంత గెలుచుకున్నాడంటే..?

Jackpot: ఎమిరేట్స్‌ డ్రాలో భారతీయుడికి జాక్‌పాట్‌ .. ఎంత గెలుచుకున్నాడంటే..?

Anil kumar poka

|

Updated on: Oct 22, 2023 | 6:44 PM

భారతీయులు విదేశాల్లో ఉన్నత పదవులే కాదు, జాక్‌పాట్‌లూ కొడుతున్నారు. ఎందరో విదేశాల్లో లాటరీల ద్వారా లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తమిళనాడుకు చెందిన మాగేష్‌ కుమార్‌ నటరాజన్‌ అనే వ్యక్తి ఏకంగా 16 కోట్ల లక్కీ లాటరీ గెలుచుకున్నారు. అతను 25 ఏళ్లపాటు ఆ జాక్‌పాట్‌ మనీని అందుకోనున్నారు.అక్టోబరు 20 శుక్రవారం రోజున ఎమిరేట్స్‌ డ్రాలో ఫాస్ట్‌ 5 గ్రాండ్‌ ప్రైజ్‌ గెలుపొందారు.

భారతీయులు విదేశాల్లో ఉన్నత పదవులే కాదు, జాక్‌పాట్‌లూ కొడుతున్నారు. ఎందరో విదేశాల్లో లాటరీల ద్వారా లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తమిళనాడుకు చెందిన మాగేష్‌ కుమార్‌ నటరాజన్‌ అనే వ్యక్తి ఏకంగా 16 కోట్ల లక్కీ లాటరీ గెలుచుకున్నారు. అతను 25 ఏళ్లపాటు ఆ జాక్‌పాట్‌ మనీని అందుకోనున్నారు. అక్టోబరు 20 శుక్రవారం రోజున ఎమిరేట్స్‌ డ్రాలో ఫాస్ట్‌ 5 గ్రాండ్‌ ప్రైజ్‌ గెలుపొందారు. ఈ జాక్‌పాట్‌ కొట్టిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందని మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. బహుమతి కింద ఆయనకు రానున్న 25 ఏళ్లపాటు ప్రతి నెలా దాదాపు 5 లక్షల 6 వేల రూపాయలు చొప్పన చెల్లిస్తారు. తమిళనాడులోని అంబూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న ఆయన 2019 నుంచి నాలుగేళ్లపాటు సౌదీ అరేబియాలో పని చేయడానికి వెళ్లారు. లాటరీలపై ఆసక్తి కలిగి టికెట్లు కొనేవారు. భారీ బహుమతి లభించిన తర్వాత నటరాజన్‌ ఆనందానికి అవధుల్లేవు. తాను బాల్యం నుంచి చాలా కష్టాలు అనుభవించానని, ఈ సొమ్ముతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వడంతోపాటు, సమాజంలో అవసరమైనవారికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..