Gaganyaan: గగన్‌యాన్ తొలి ప్రయోగం సక్సెస్..! బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన మాడ్యూల్.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. మనుషులను నింగిలోకి పంపే ప్రయోగంలో విజయం సాధించింది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అక్టోబరు 21న జరిగిన టీవీ-డీ1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతమైంది. మొదట ఈ రాకెట్ ప్రయోగాన్ని రెండు సార్లు వాయిదా వేసినా.. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు విజయవంతంగా నిర్వహించారు. టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్నట్లే నింగిలోకి దూసుకెళ్లి..
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. మనుషులను నింగిలోకి పంపే ప్రయోగంలో విజయం సాధించింది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అక్టోబరు 21న జరిగిన టీవీ-డీ1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతమైంది. మొదట ఈ రాకెట్ ప్రయోగాన్ని రెండు సార్లు వాయిదా వేసినా.. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు విజయవంతంగా నిర్వహించారు.
టీవీ-డీ1 క్రూ మాడ్యూల్ అనుకున్నట్లే నింగిలోకి దూసుకెళ్లి.. ఆ తర్వాత బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. పారాచూట్ల ఆధారంగా మాడ్యూల్ నీటిపై వాలింది. మూడు పారాచూట్ల సాయంతో క్రూ మాడ్యూల్ దిగింది. సముద్రంలో ఉన్న ఇండియన్ నేవీ ఆ మాడ్యూల్‌ను సేకరిస్తుంది. అక్టోబరు 21 ఉదయం 8 గంటలకు వెదర్ సరిగా లేని కారణంగా ప్రయోగాన్ని 45 నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం 8 గంటల 45 నిమిషాలకు చేపట్టిన టీవీ-డీ1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. రాకెట్ ఇంజిన్‌లో లోపం తలెత్తినట్టు ఇస్రో వెల్లడించింది. అనుకున్న సమయానికి ఇంజిన్ మండకపోవడం వల్ల గగన్‌యాన్ మాడ్యూల్ పరీక్షను వాయిదా వేశారు. 5 సెకన్ల ముందు పరీక్షను రద్దు చేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు మరోసారి ప్రయోగం నిర్వహించారు. ఈ క్రమంలో టీవీ-డీ1 టెస్ట్ విజయవంతమైంది. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు మరింత ఉత్తేజం వచ్చింది. టీవీ-డీ1 ఫ్లయిట్ సక్సెస్ కావడం పట్ల ఇస్రో చైర్మెన్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాన్ని త్వరగా పసికట్టి.. చాలా తక్కువ సమయంలోనే మళ్లీ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

