Niharika Handa: ఇదీ.. సైనికుల పిల్లల పరిస్థితి.! సైనికులతో పాటు వారి పిల్లలూ దేశ సేవ..
సైనికులు దేశ రక్షణకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ముందుంటారు. విధుల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో, సైనికుల పిల్లలు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటుంటారో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ నిహారికా హండా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నిహారికా పెట్టిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది.
సైనికులు దేశ రక్షణకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ముందుంటారు. విధుల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో, సైనికుల పిల్లలు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటుంటారో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ నిహారికా హండా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నిహారికా పెట్టిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. సైనికుల పిల్లలు అద్భుతమైనవారని, వారుకూడా తమ తల్లిదండ్రులతోపాటు తమవంతు దేశ సేవ చేస్తారని పేర్కొన్నారు. వృత్తిరిత్యా తమ తల్లిదండ్రులు ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ అలవాటుపడే లోపే మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని, పెద్దల కోసం తమ ఇష్టాలను, స్నేహాలను వీడాల్సి వస్తుందని తెలిపారు. ఒకే దగ్గర స్థిరంగా చదువుకునే పరిస్థితి వారికి ఉండదన్నారు. ఈ మార్పు వారి జీవితంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఎవరికైనా తమ స్నేహితులు, అలవాట్లకు గుడ్‌బై చెప్పేసి, కొత్త ప్రాంతానికి వెళ్లడం అంత సులభమేమీ కాదని, వీడ్కోలు పదం సైనికుల పిల్లలైన చిన్నారుల జీవితంలో తరచూ వినిపిస్తుందని రాసుకొచ్చారు. ఈ ప్రయాణంలో వారు ఎనలేని ధైర్యసాహసాలు, చొరవ చూపిస్తుంటారని, ఈ రకంగా వారు కూడా దేశానికి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిల్లలందరి పట్ల తనకెంతో గర్వంగా ఉంది అంటూ సైనికుల బిడ్డలను నిహారిక అభినందించారు. విధుల్లో భాగంగా నిత్యం బిజీగా ఉండే తనకు తన బిడ్డ అందిస్తోన్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇంత చిన్నవయసులోనే తన చిన్నారి బాబు, తనకు, తన భర్తకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ తన చిన్నారితో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆమె చేసిన పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంది. ఇలా స్నేహితుల్ని, చదువుతున్న పాఠశాలను వదిలి కొత్త ప్రాంతానికి వెళ్లడం అంత సులభం కాదంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక సైనికుడి బిడ్డగా ఈ పోస్టులో ప్రతి పదం తన జీవితంలోనిదేనని, ప్రతిసారి ఉన్న ప్రాంతాన్ని వీడటం ఒక సవాలే కాదు.. ఎదగడానికి అవకాశం కూడా అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..