Israel: కాఫీ ఇచ్చి,  కబుర్లు చెప్పి ఐదుగురు ఉగ్రవాదుల్ని పట్టించిన ఇజ్రాయెల్ మహిళ.

Israel: కాఫీ ఇచ్చి, కబుర్లు చెప్పి ఐదుగురు ఉగ్రవాదుల్ని పట్టించిన ఇజ్రాయెల్ మహిళ.

Anil kumar poka

|

Updated on: Oct 21, 2023 | 10:14 PM

క్లాస్‌ రూమ్‌లో అందరూ చెబుతారు.. కానీ ఎగ్జామ్‌లో రాసినవాడే టాపర్‌ అవుతాడు.. ఈడైలాగ్‌ అల్లు అర్జున్‌ ఓ సినిమాలో చెబుతాడు. సరిగ్గా ఈ డైలాగ్‌కి తగ్గట్టుగా వ్యవహరించారు ఇజ్రాయెల్‌ మహిళ. ఓ వైపు ఉగ్రవాదులు ఇంట్లో చొరబడి చంపేస్తామని బెదిరిస్తున్నా భయపడకుండా వారితో మాటలు కలిపి, ఆపై కాఫీ ఆఫర్‌ చేసి చివరికి ఆ ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు పోలీసులకు సహకరించారు.

క్లాస్‌ రూమ్‌లో అందరూ చెబుతారు.. కానీ ఎగ్జామ్‌లో రాసినవాడే టాపర్‌ అవుతాడు.. ఈడైలాగ్‌ అల్లు అర్జున్‌ ఓ సినిమాలో చెబుతాడు. సరిగ్గా ఈ డైలాగ్‌కి తగ్గట్టుగా వ్యవహరించారు ఇజ్రాయెల్‌ మహిళ. ఓ వైపు ఉగ్రవాదులు ఇంట్లో చొరబడి చంపేస్తామని బెదిరిస్తున్నా భయపడకుండా వారితో మాటలు కలిపి, ఆపై కాఫీ ఆఫర్‌ చేసి చివరికి ఆ ఉగ్రవాదులను మట్టికరిపించేందుకు పోలీసులకు సహకరించారు. ఆమె సమయస్పూర్తికి, ధైర్యానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం మురిసిపోయారు. అనేకమంది ఆమెపై ప్రశంసలు కురిపించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి పడేశారు. ఇళ్లలోకి చొరబడి చిన్నారులు, మహిళలు అనిచూడకుండా ప్రాణాలు తీశారు. ఎంతోమందిని బందీలుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రనేడ్లతో రేచల్ అనే 65 ఏళ్ల మహిళ ఇంట్లోకి ప్రవేశించారు. రేచల్, ఆమె భర్తను బందీలుగా చేసుకున్నారు. ఈ సమయంలోనే రేచల్‌ ఎంతో ధైర్యంగా, సమయస్పూర్తితో వ్యవహరించారు. ఉగ్రవాదులు గన్‌ గురిపెట్టినా భయపడలేదు, బెదిరిపోలేదు. ఎందుకంటే వారి ఇద్దరు పిల్లలూ పోలీసులే. వారు వచ్చి ఎలాగైనా కాపాడతారనే ధైర్యంతో ఉన్నారు.

కానీ వారి పిల్లలు వచ్చేవరకూ వారు ప్రాణాలతో ఉండాలి కదా.. అందుకే రేచల్‌ చాలా తెలివిగా వ్యవహరించారు. ఉగ్రవాదులు ఆకలిగా ఉన్నట్టు గమనించి వారికి డ్రింక్ ఆఫర్ చేశారు. అలాగే, కాఫీ.. కుకీలు కూడా ఇచ్చి వారితో నెమ్మదిగా మాటలు కలిపారు. తాను ఇన్సులిన్ ఇంక్షన్ వేసుకోవాలని చెప్పి ఉగ్రవాదుల దృష్టి ఆమె పిల్లల వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అంతేకాదు, తనకు అరబిక్ నేర్పించమంటూ బదులుగా వారికి తాను హిబ్రూ నేర్పిస్తానని ఉగ్రవాదులను మెల్లగా మాటల్లో దించారు. అలా దాదాపు 20 గంటలపాటు వారిని ఏమారుస్తూ గడిపారు ఆ వృద్ధ దంపతులు. మరోవైపు, తన కుటుంబం ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న విషయం తెలుసుకున్న కుమారుడు పోలీసులతో కలిసి ఇంటికి వెళ్లాడు. వారి రాకను పసిగట్టిన ఉగ్రవాదులు రేచల్ దంపతులను చంపేస్తామని బెదిరించారు. ఇంటి తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి ప్రవేశించేసరికి ఓ ఉగ్రవాది తల్లి మెడ పట్టుకుని చంపేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ బెదరని ఆమె ఇంట్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు వేళ్ల సైగల ద్వారా కుమారుడికి చెప్పింది. చివరికి అర్ధరాత్రి వేళ స్వాట్ బృందం ఆ ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి రేచల్, ఆమె భర్త డేవిడ్‌ను రక్షించారు. రేచల్ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలియడంతో రాత్రికి రాత్రే ఆమె హీరోగా మారిపోయారు. ప్రశంసల వర్షం కురిసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించిన సందర్భంలో ఆయన కొందరు పౌరులను కలిశారు. వారిలో రేచల్ కూడా ఉన్నారు. ఆమె ధైర్యసాహసాల గురించి తెలిసిన బైడెన్ రేచల్‌ను ఆలింగనం చేసుకుని ప్రశంసించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..