Viral: ఈ దొంగ ఐడియా అదిరింది కానీ.. దురదృష్టం అడ్డొచ్చింది..! వీడియో వైరల్..
దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. పట్టపగలే వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ దొంగ ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. షాపుల్లో పెట్టే మెనాక్విన్ బొమ్మలా మారిపోయి రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎంచక్కా తనకు కావలసిన నగలు బ్యాగులో సర్దుకొని చక్కగా వెళ్లిపోయాడు. కానీ ఎన్ని తెలివి తేటలున్నా ఒకటి రెండుసార్లు మాత్రమే వర్కవుట్ అవుతాయి. చివరికి తన ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కిపోయాడు.
దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. పట్టపగలే వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ దొంగ ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. షాపుల్లో పెట్టే మెనాక్విన్ బొమ్మలా మారిపోయి రాత్రి షాపు మూసేసిన తర్వాత ఎంచక్కా తనకు కావలసిన నగలు బ్యాగులో సర్దుకొని చక్కగా వెళ్లిపోయాడు. కానీ ఎన్ని తెలివి తేటలున్నా ఒకటి రెండుసార్లు మాత్రమే వర్కవుట్ అవుతాయి. చివరికి తన ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కిపోయాడు. ఈ ఘటన పోలండ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాండ్‌లోని వార్సా నగరంలో ఓ యువకుడు నగల షాపులో కొంతసేపు బొమ్మలా నిలబడి, షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. నిందితుడు తొలుత ఓ షాపింగ్ సెంటర్‌లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.
షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా తిని తర్వాత మరో బట్టల షాపులో బట్టలు చోరీ చేశాడు. ఇంతవరకూ బాగానే మేనేజ్ చేసాడు.. కానీ చివర్లో అతడిని దురదృష్టం వెంటాడడంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు మరో షాపింగ్ సెంటర్‌లో కూడా ఇలాగే చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..