Rapid express: ర్యాపిడ్ ఎక్స్‌ప్రెస్… ఇది వందేభారత్‌ను మించి.. అబ్బురపరిచే సౌకర్యాలు, విశేషాలు.
ప్రయాణికుల దూరభారాన్ని తగ్గించేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు మరో మరో హైస్పీడ్ ప్రాంతీయ రైలును అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు భారతదేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబరు 20న ప్రారంభించారు. గంటకు 160కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో...
ప్రయాణికుల దూరభారాన్ని తగ్గించేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు మరో మరో హైస్పీడ్ ప్రాంతీయ రైలును అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు భారతదేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబరు 20న ప్రారంభించారు. గంటకు 160కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ- ఘజియాబాద్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లో పరుగులు పెట్టే ఈ రైలు సాహిబాబాద్- దుహై డిపో మధ్య 17 కిలో మీటర్ల దూరం గల ప్రాధాన్య కారిడార్‌లో తొలి రాపిడ్ ఎక్స్ రైలు సేవలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమోభారత్‌గా నామకరణం చేశారు. అక్టోబరు 21 నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడొంతులు తగ్గుతుంది. ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు.
ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉంది. చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో 20 నుచంఇ 40 రూపాయలు ఉంటుంది. ప్రీమియం కోచ్‌లో 40 నుంచి 100 రూపాయలు ఉంటుంది. ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..