Viral: గబ్బిలాలు ఆ ఊరి అదృష్ట దేవతలు.! చింతచెట్టుకు పూజలు.. గబ్బిలాల వ్యర్థాలతో స్నానం.
సాధారణంగా గబ్బిలాలు అంటే అందరికీ భయమే. అవి గ్రామాల్లో సంచరిస్తే అరిష్టంగా భావిస్తారు. వాటి అరుపులు కూడా అపశకునం అనుకుంటారు. ఇక చింత చెట్టుకు ఎక్కడైనా ఎవరైనా పూజలు చేయడం చూశారా.. కానీ ఈ గ్రామస్తులకు ఈ రెండే ఆరాధ్య దైవాలు. గబ్బిలాల శబ్దాలు వారికి శుభ సూచకాలు.. చింతచెట్టును పూజిస్తే వారి చింతలన్నీ పోతాయని నమ్ముతారు. ఈ వింత నమ్మకాల గ్రామం కడప జిల్లాలో ఉంది.
సాధారణంగా గబ్బిలాలు అంటే అందరికీ భయమే. అవి గ్రామాల్లో సంచరిస్తే అరిష్టంగా భావిస్తారు. వాటి అరుపులు కూడా అపశకునం అనుకుంటారు. ఇక చింత చెట్టుకు ఎక్కడైనా ఎవరైనా పూజలు చేయడం చూశారా.. కానీ ఈ గ్రామస్తులకు ఈ రెండే ఆరాధ్య దైవాలు. గబ్బిలాల శబ్దాలు వారికి శుభ సూచకాలు.. చింతచెట్టును పూజిస్తే వారి చింతలన్నీ పోతాయని నమ్ముతారు. ఈ వింత నమ్మకాల గ్రామం కడప జిల్లాలో ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లోని మాధవరం పోడు అనే గ్రామంలో దాదాపు 450 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ ఊరి మధ్యలో ఓ పెద్ద చింత చెట్టు ఉంది. దానిపైన పెద్ద సంఖ్యలో దబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. అవి నిత్యం చేసే శబ్దాలతో ఆ గ్రామం అంతా కోలాహలంగా ఉంటుంది. అదే తమ ఊరి అదృష్టం అంటున్నారు స్థానికులు. గబ్బిలాలు తమ గ్రామానికి రావడం వల్లే గ్రామం సుభిక్షంగా ఉందని చెబుతారు. గతంలో తమ ఊరిలో ఎప్పుడూ గొడవలు, కొట్లాటలతో ప్రశాంతతే లేకుండా ఉండేదని, ఈ గబ్బిలాలు వచ్చినప్పటినుంచి తమ ఊరిలో గొడవలు అన్నీ సద్దుమణిగి ప్రశాంతంగా ఉందని నమ్ముతారు. అంతేకాదు.. తమ గ్రామంలో పంటలు బాగా పండుతూ ఎంతో సుభిక్షంగా ఉన్నామని చెబుతుంటారు ఆ గ్రామస్థులు . ఆ పక్షులకి ఎటువంటి హాని జరగకుండా గ్రామస్థులు రక్షణ గా వుంటారు. అంతేకాదు, సాక్షాత్తు దేవతలే ఆ గబ్బిలాల రూపంలో తమ గ్రామంలో కొలువుతీరారని విశ్వసిస్తారు. నిత్యం పూజలు చేస్తారు. అంతే కాదు గబ్బిలాల మలంతో పిల్లలకు స్నానం చేయిస్తారు. అలాచేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతుంటారు. అయితే కోడూరు మండలం కి చెందిన గంగు రాజుపోడు అనే మరో గ్రామస్థులు మాత్రం గతంలో ఆ గబ్బిలాలు తమ గ్రామంలోనే ఉండేవని, గ్రామంలో వేటగాళ్లు గబ్బిలాలను చంపి తినడం వల్ల పక్కగ్రామానికి వెళ్లిపోయాయంటున్నారు. అప్పటినుంచి తమ గ్రామంలో పంటలు లేవని, గ్రామంలో అల్లర్లు పెరిగిపోయాయని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..