Viral: కారు ఇంజిన్‌లో 6 అడుగుల కొండచిలువ.! బయటకు తీయడానికి ఏం చేసారంటే..?

Viral: కారు ఇంజిన్‌లో 6 అడుగుల కొండచిలువ.! బయటకు తీయడానికి ఏం చేసారంటే..?

Anil kumar poka

|

Updated on: Oct 21, 2023 | 9:09 PM

పామును అంత దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక రోజూ తిరిగే కారులో కనపడితే భయంతో బిగుసుపోవడమే! ఢిల్లీలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చిత్తరంజన్ పార్క్ వద్ద ఆ వ్యక్తికి తన కారు ఇంజన్‌లో ఆరడుగుల కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే బెదిరిపోయిన సదరు వ్యక్తి వెంటనే వైల్డ్‌లైఫ్‌ ఎన్జీవోకు ఎస్‌వోఎస్‌ పంపి సమాచారం అందించాడు.

పామును అంత దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక రోజూ తిరిగే కారులో కనపడితే భయంతో బిగుసుపోవడమే! ఢిల్లీలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చిత్తరంజన్ పార్క్ వద్ద ఆ వ్యక్తికి తన కారు ఇంజన్‌లో ఆరడుగుల కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే బెదిరిపోయిన సదరు వ్యక్తి వెంటనే వైల్డ్‌లైఫ్‌ ఎన్జీవోకు ఎస్‌వోఎస్‌ పంపి సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న సిబ్బంది కారు కింద నేలపై పడుకుని అష్టకష్టాలు పడి దానిని బంధించారు. ఈ ఆపరేషన్‌కు దాదాపు 30 నిమిషాలు పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను వైల్డ్‌లైఫ్ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇంజన్ కు కొండచిలువ చుట్టుకుని ఉండడంతో దాన్ని సురక్షితంగా బయటకు తీయడానికి దాదాపు అరగంట సమయం పట్టిందని ఎన్జీవో తెలిపింది. దాన్ని సురక్షితంగా అటవీశాఖ సిబ్బందికి అప్పగించినట్లు రాసుకొచ్చింది. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టారని వివరించారు. కొండచిలువలు, పాములు కనపడితే వాటిని చంపొద్దని, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎన్జీవో సిబ్బంది సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..