Rohit Sharma: వివాదంలో రోహిత్ శర్మ.. హైవేపై ఓవర్ స్పీడ్ డ్రైవింగ్.! కెప్టెన్‌కు ట్రాఫిక్ చలాన్..
బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్ మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబయి-పుణె మార్గంలో అతడి కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు జరిమానా విధించారు. ఒక దశలో రోహిత్ కారు అత్యధికంగా 215 కి.మీ వేగాన్ని అందుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు యజమాని అయిన రోహిత్‌కు చలానాలు వేశారు. అసలేం జరిగిందంటే..
బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్ మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబయి-పుణె మార్గంలో అతడి కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు జరిమానా విధించారు. ఒక దశలో రోహిత్ కారు అత్యధికంగా 215 కి.మీ వేగాన్ని అందుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు యజమాని అయిన రోహిత్‌కు చలానాలు వేశారు. అసలేం జరిగిందంటే.. అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడిన అనంతరం రోహిత్ ఫ్లైట్‌లో ముంబయికి చేరుకున్నారు. కాగా టీం సభ్యులందరూ పూణెలో ఉండగా.. వారికి 5 రోజులు బ్రేక్ ఉండటంతో రెండు రోజులపాటు కుటుంబ సభ్యులతో గడిపిన రోహిత్ శర్మ.. అనంతరం పూణెకి రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై 200 కి.మీకి తగ్గకుండా తన లంబోర్ఘినీ ఉరుస్ కారులో మెరుపు వేగంతో దూసుకెళ్లాడు. హైవేపై రోహిత్ తన కారును పరిమితికి మించిన వేగంతో నడిపినందుకు గాను మూడు చలాన్లు విధించినట్లు సమాచారం. ఇప్పుడు హైవేలపై అక్కడక్కడా వేగాన్ని కొలిచే మీటర్లను అమర్చడంతో ఆటోమేటిక్‌గా వాహనాలు వెళ్లే వేగాన్ని బట్టి ఫైన్ వేస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో రోహిత్ 217 పరుగులు చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..