Viral: కవ్వాల్ టైగర్ జోన్ కు విదేశీ మహిళా బైక్ రైడర్స్.! వైరల్ వీడియో..

Viral: కవ్వాల్ టైగర్ జోన్ కు విదేశీ మహిళా బైక్ రైడర్స్.! వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Oct 21, 2023 | 9:01 PM

తెలంగాణలోని కవ్వాల్‌ అభయారణ్యాన్ని చూసేందుకు ఖండాంతరాలు దాటి వచ్చారు కొందరు మహిళలు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో మహిళలు బైకులపై దూసుకెళ్తూ కవ్వాల్ అభయారణ్య వాసులను ఆకట్టుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత్‌ సంస్కృతీ సంప్రదాయలపై ఆసక్తితో వాటి గురించి తెలుసుకునేందుకు భారత్‌కు వచ్చామన్నారు ఈ బైక్‌ రైడర్స్‌..

తెలంగాణలోని కవ్వాల్‌ అభయారణ్యాన్ని చూసేందుకు ఖండాంతరాలు దాటి వచ్చారు కొందరు మహిళలు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో మహిళలు బైకులపై దూసుకెళ్తూ కవ్వాల్ అభయారణ్య వాసులను ఆకట్టుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత్‌ సంస్కృతీ సంప్రదాయలపై ఆసక్తితో వాటి గురించి తెలుసుకునేందుకు భారత్‌కు వచ్చామన్నారు ఈ బైక్‌ రైడర్స్‌. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు తరలివచ్చిన ఈ వనితలు హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడినుంచి స్పోర్ట్స్‌ బైక్స్‌పై రైడింగ్‌ చేస్తూ 300 కిలోమీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు చేరుకున్నారు. దొంగపల్లి ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి అక్కడి మహిళలను కలుసుకుని గిరిజన సంప్రదాయాలను తెలుసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో బతుకమ్మ వేడుకలను చూసి మురిసిపోయారు. ఆదివాసీ మహిళలు.. ఈ రైడర్లకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి చీర సారె పెట్టి సాగనంపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..