Hyderabad: పోలీసునే కారుతో ఢీకొట్టి ఆపై ఏం చేసాడంటే.. వైరల్ అవుతున్న వీడియో.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసును ఓ ఆగంతకుడు కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. చిలకలగూడలో అక్టోబరు 18 రాత్రి ఈ ఘటన జరిగింది.పోలీసులు కారును ఆపమన్నా వినకుండా వేగంగా దూసుకెళుతూ అతడిని ఢీకొట్టాడు. గోపాలపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని చిల్లరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసును ఓ ఆగంతకుడు కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. చిలకలగూడలో అక్టోబరు 18 రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు కారును ఆపమన్నా వినకుండా వేగంగా దూసుకెళుతూ అతడిని ఢీకొట్టాడు. గోపాలపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని చిల్లరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనిఖీలలో భాగంగా చిల్ల రోడ్డులో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బ్యారికేడ్లను దాటుకుని కారు ముందుకు వెళ్లిపోతుండగా మహేశ్ అనే కానిస్టేబుల్ కారుకు ఎదురొచ్చి ఆపమని సైగ చేశాడు. కానీ డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా అతడిని కారుతో ఢీకొట్టాడు. దీంతో, కానిస్టేబుల్ ఎగిరిపక్కకు పడ్డాడు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు మిగతా పోలీసులు. కానిస్టేబుల్ మహేష్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అతడి చేయికి బలంగా దెబ్బ తగలడంతో విరిగినట్టు పేర్కొన్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేపనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..