AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా కాళ్లు పొడవుగా ఉన్నాయనీ.. ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగానికి తిరస్కరించారు’ అమితాబ్‌

బాలీవుడ్ స్టార్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తెలియని వారుండరు. తన అద్భుత నటనతో 70, 80, 90లలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అమితాబ్‌ భారత సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్‌ ప్రోగ్రామ్‌ 'కౌన్‌ బనేగ కరోడ్‌పతి'కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో 15వ సీజన్‌ ఆగస్టు 14 నుంచి టీవీలో ప్రసారం అవుతోంది. అక్టోబర్‌ 19న ప్రసారం అయిన 48వ ఎపిసోడ్‌లో బిగ్‌బి తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని..

'నా కాళ్లు పొడవుగా ఉన్నాయనీ.. ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగానికి తిరస్కరించారు' అమితాబ్‌
Amitabh Bachchan
Srilakshmi C
|

Updated on: Oct 20, 2023 | 5:08 PM

Share

బాలీవుడ్ స్టార్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తెలియని వారుండరు. తన అద్భుత నటనతో 70, 80, 90లలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అమితాబ్‌ భారత సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్‌ ప్రోగ్రామ్‌ ‘కౌన్‌ బనేగ కరోడ్‌పతి’కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో 15వ సీజన్‌ ఆగస్టు 14 నుంచి టీవీలో ప్రసారం అవుతోంది. అక్టోబర్‌ 19న ప్రసారం అయిన 48వ ఎపిసోడ్‌లో బిగ్‌బి తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ తన ఎత్తు కారణంగా తనకు ఇష్టమైన ఉద్యోగం నుంచి నిష్క్రమించబడ్డానని ఈ షోలో వెల్లడించారు. చదువు పూర్తయ్యాక అమితాబ్ బచ్చన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని అనుకున్నాడని, కానీ కాళ్లు చాలా పొడవుగా ఉన్నాయని తనకు ఉద్యోగం నిరాకరించారని ఆయన వెల్లడించారు. అమితాబ్‌ మాట్లాడుతూ..

‘నేను పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఏమి చేయాలో నాకు తోచలేదు. అప్పుడు నేను మా కుటుంబంతో కలిసి ఢిల్లీలో ఉండేవాడిని. ఆర్మీకి చెందిన ఒక మేజర్ జనరల్ మా ఉంటికి సమీపంలో ఉండేవాడు. అతను ఒకసారి మా ఇంటికి వచ్చాడు. నన్ను ఆర్మీలో పెద్ద ఆఫీసర్‌ని చేస్తానని ఆయన మానాన్నతో చెప్పాడు. అప్పుడు మా నాన్న నన్ను ఆయనతో పంపించాడు. అలా నేను ఎయిర్‌ఫోర్స్‌లోకి నేను వెళ్లాలనుకున్నాను. కానీ ఆ అది నెరవేరలేదు. నేను ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు నా కాళ్లు చాలా పొడవుగా ఉన్నాయని.. ఎయిర్‌ఫోర్స్‌కు అర్హత సాధించలేనని నన్ను తిరస్కరించారు’ అని అమితాబ్‌ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

కాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఎందరో ఈ ప్రోగ్రామ్‌ను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌’ నడుస్తోంది. ఈ ప్రోగ్రాం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ను SonyLIV యాప్‌లో కూడా వీక్షించవచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే ‘గుడ్‌బాయ్‌’ మువీలో అమితాబ్‌ అలరించారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్‌ కె’లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మువీలో ప్రభాస్‌కజోడిగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.