Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి శివాజీ బయటకు వెళ్లనున్నారా..? మీరేమనుకుంటున్నారు

నామినేషన్స్ లో శివాజీ ఉన్నప్పటికీ ప్రేక్షకుల సపోర్ట్ తో నామినేషన్స్ నుంచు బయట పడ్డారు. ప్రస్తుతం శివాజీకి చేతికి గాయం అయ్యింది. ఇటీవలే ఆయనను స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు కూడా పంపించేశారు. గత  మూడు నాలుగు ఎపిసోడ్స్ నుంచి చేతికి కట్టుతో కనిపిస్తున్నాడు శివాజీ. హౌస్ లో ఆయన ఎక్కువగా సంచలక్ గానే వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు బిగ్ బాస్ టీమ్.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి శివాజీ బయటకు వెళ్లనున్నారా..? మీరేమనుకుంటున్నారు
Bigg Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 20, 2023 | 5:28 PM

బిగ్ బాస్ హౌస్ లో పెద్ద మనిషిలా పేరు తెచ్చుకున్నారు హీరో శివాజీ. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి శివాజీ తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు శివాజీ. అలాగే హౌస్ లో పవర్ అస్త్ర సొంతం చేసుకున్నాడు. అలాగే హౌస్ లో అందరితో మంచిగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. నామినేషన్స్ లో శివాజీ ఉన్నప్పటికీ ప్రేక్షకుల సపోర్ట్ తో నామినేషన్స్ నుంచు బయట పడ్డారు. ప్రస్తుతం శివాజీకి చేతికి గాయం అయ్యింది. ఇటీవలే ఆయనను స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు కూడా పంపించేశారు. గత  మూడు నాలుగు ఎపిసోడ్స్ నుంచి చేతికి కట్టుతో కనిపిస్తున్నాడు శివాజీ. హౌస్ లో ఆయన ఎక్కువగా సంచలక్ గానే వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు బిగ్ బాస్ టీమ్.

ఈ ప్రోమోలో శివాజీని కన్సెషన్ రూమ్ కు పిలిపించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు బిగ్ బాస్. ఇక శివాజీ ఎలా ఉన్నారు అని అడగ్గానే ఎమోషనల్ అయ్యారు. చాలా ఇబ్బందిపడుతున్నా బిగ్ బాస్ అని చెప్పాడు. చెయ్యి చాలా నొప్పిగా ఉంది. బాగా లాగేస్తుంది అని అన్నారు. అలాగే ఎవ్వరు లేనప్పుడు ఒక్కడినే ఏడుస్తున్నాను. ఎవరైనా ఉంటే బయటకు నవ్వుతూ .. లోపల ఏడుస్తున్నా అని అన్నారు శివాజీ.

ఆతర్వాత శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేయి నొప్పితో బాధపడుతూనే గేమ్ ఆడుతున్నప్పటి తాను సరిగ్గా ఆడటం లేదు అని ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు అని బాధపడ్డారు శివాజీ. శివాజీ ఎమోషనల్ అవవడంతో పాటు చేయి నొప్పితో బాధపడుతుండటం ఆయనను హౌస్  నుంచి బయటకు పంపించనున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎం మరి మీరేమనుకుంటున్నారు.? శివాజీ హౌస్ నుంచి బయకు వెళ్ళిపోతారా..? లేక కంటిన్యూ అవుతారా..? అన్నది చూడాలి. మీరుకూడా మీ అభిప్రాయాన్ని ఈ కింద తెలపండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి