AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Movie : లియో మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో తెలుసా..? స్ట్రీమింగ్ అప్పుడేనా.?

దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని ఆదుకుంది. కలెక్షన్స్ విషయంలోనూ లియో సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల వరకు వసూల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో సినిమా మంచి వసూల్ చేసింది.

Leo Movie : లియో మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో తెలుసా..? స్ట్రీమింగ్ అప్పుడేనా.?
Leo
Rajeev Rayala
|

Updated on: Oct 20, 2023 | 5:56 PM

Share

దళపతి విజయ్ నటించిన లియో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తొలి షో నుంచే లియో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య లియో అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. లియో సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని ఆదుకుంది. కలెక్షన్స్ విషయంలోనూ లియో సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల వరకు వసూల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో సినిమా మంచి వసూల్ చేసింది. దాదాపు 16 కోట్ల వరకు వసూల్ చేసింది.

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన గత సినిమాలు ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు. ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచేసుకున్నారు. లియో రిలీజ్ తర్వాత ఆ అంచనాలు అందుకుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు . అనిరుధ్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇప్పుడు లియో మూవీ ఓటీటీ పార్ట్నర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. లియో సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇక ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను దీపావళి తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నవంబర్ మూడో వారంలో లియో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

లియో మూవీ ఫ్యాన్స్ ట్విట్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా