Female Constable Suicide: మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. శరీరంపై 500కుపైగా గాయాలు! ఎన్నో అనుమానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఏహెచ్‌టీయూ పోలీస్ స్టేషన్‌ విధులు నిర్వహిస్తోన్న మీను ధామా అనే మహిళా కానిస్టేబుల్ గత గురువారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీస్‌ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన తోటి పోలీసు సిబ్బంది మహిళా కానిస్టేబుల్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసు..

Female Constable Suicide: మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. శరీరంపై 500కుపైగా గాయాలు! ఎన్నో అనుమానాలు
Unnav Female Constable Suicide
Follow us

|

Updated on: Oct 22, 2023 | 4:24 PM

లక్నో, అక్టోబర్ 22: ఓ మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానిస్టేబుల్‌ మృతదేహంపై దాదాపు 500కుపైగా గాయాల గుర్తులు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఏహెచ్‌టీయూ పోలీస్ స్టేషన్‌ పరిధిలో అక్టోబర్‌ 19 (గురువారం) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఏహెచ్‌టీయూ పోలీస్ స్టేషన్‌ విధులు నిర్వహిస్తోన్న మీను ధామా అనే మహిళా కానిస్టేబుల్ గత గురువారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీస్‌ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన తోటి పోలీసు సిబ్బంది మహిళా కానిస్టేబుల్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసు లైన్‌లో ఉన్న ఇతర పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ మహిళా కానిస్టేబుల్‌ మీను ప్రాణాలు కోల్పోయింది. కానిస్టేబుల్ మీను మృతి చెందిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.

బాగ్‌పత్ జిల్లాలోని ఖేక్రా పోలీస్ స్టేషన్‌లోని ఖేక్రా గ్రామానికి చెందిన మృతురాలు మీను 2019లో ధామ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం మీను ధామా ఉన్నావ్‌లోని AHTU పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. మరోవైపు కూతురు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహిళా కానిస్టేబుల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో మీను శరీరంపై 500కుపైగా గాయాలు ఉన్నట్లు గుర్తించరాఉ. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్, సిఓ సిటీ అశుతోష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీను ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె శరీరంపైకి ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉందని, అయితే అతడు మీనును మోసగించి వేరే మహిళను పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మీను ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అతను సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.