AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Seized in Proddutur: ప్రొద్దుటూరులో 300 కేజీల బంగారం సీజ్‌.. దెబ్బకు షాపులన్నీ క్లోజ్‌

ముంబాయి తర్వాత ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం జోరుగా సాగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. గోల్డ్‌ బిజినెస్‌లో ప్రొద్దులూరుకు రెండో ముంబాయి అనే పేరు కూడా ఉంది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు ప్రముఖ జ్యువెల్లరీ షాపుల్లో దాడి చేశారు. నగరంలోని బుశెట్టి జ్యువెలర్స్‌, డైమండ్స్ జ్యువెలర్స్‌, గురురాఘ‌వేంద్ర జ్యువెలర్స్‌, త‌ల్లం జ్యువెలర్స్‌లలో ఐటీ అధికారులు 4 రోజులుగా త‌నిఖీలు చేప‌ట్టారు. సోదాలు జరుగుతున్న..

Gold Seized in Proddutur: ప్రొద్దుటూరులో 300 కేజీల బంగారం సీజ్‌.. దెబ్బకు షాపులన్నీ క్లోజ్‌
Gold Seized In Proddutur
Srilakshmi C
|

Updated on: Oct 22, 2023 | 5:40 PM

Share

ప్రొద్దుటూరు, అక్టోబర్ 22: గత నాలుగు రోజులుగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వరుసగా జరపుతోన్న ఐటీ అధికారుల త‌నిఖీలు నేటితో ముగిశాయి. నగరంలోని నాలుగు ప్రముఖ జ్యూవెలరీ షాపుల్లో ఐటీ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. లెక్కాపత్రంలేని దాదాపు 300 కేజీల బంగారాన్ని సీజ్‌ చేసినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

ఆ నాలుగు షాపులే టార్గెట్..

ముంబాయి తర్వాత ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం జోరుగా సాగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. గోల్డ్‌ బిజినెస్‌లో ప్రొద్దులూరుకు రెండో ముంబాయి అనే పేరు కూడా ఉంది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు ప్రముఖ జ్యువెల్లరీ షాపుల్లో దాడి చేశారు. నగరంలోని బుశెట్టి జ్యువెలర్స్‌, డైమండ్స్ జ్యువెలర్స్‌, గురురాఘ‌వేంద్ర జ్యువెలర్స్‌, త‌ల్లం జ్యువెలర్స్‌లలో ఐటీ అధికారులు 4 రోజులుగా త‌నిఖీలు చేప‌ట్టారు. సోదాలు జరుగుతున్న జ్యూవెలర్స్ షాపుల వద్ద సీఆర్పీఫ్ పోలీసులు సైతం మోహరించారు. దాడుల సమయంలో బయట నుంచి షాపుల్లోకి ఎవ్వరినీ వెళ్లకుండా సీఆర్పీఫ్ బలగాలు అడ్డుకున్నాయి. నగరంలో ఐటీ దాడుల నేపథ్యంలో పలు జ్యువెల్లరీ షాపులను యజమానులు క్లోజ్‌ చేశారు. దసరా పండగ సమయంలో షాపులన్నీ మూసివేసయంతో వినియోగదారులకు నిరాశ ఎదురైంది.

గోల్డ్ ప్రియులకు తప్పని నిరాశ

ఇక ఈ దాడుల్లో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేని బంగారాన్ని భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. ఆ బంగారం అంతటినీ ఇతర ప్రాంతాల నుంచి ఇల్లీగల్‌గా దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. కాగా ప్రొద్దుటూరులో 2 వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల షాపులు ఉన్నాయి. ప్రత్యేకించి నాలుగు షాపుల్లో మాత్రమే తనిఖీలు చేపట్టడంతో కడప జిల్లా వ్యాప్తంగా ఈ వార్త చర్చణీయాంశంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..