Andhra Pradesh: ‘నీ కులం వేరు.. నిన్ను పెళ్లి చేసుకోవడం మావాళ్లకు ఇష్టం లేదు’ ప్రియుడి మోసం తట్టుకోలేక
వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో నివాసం ఉంటోన్న భారతికి ఇద్దరు సంతానం. కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె కావ్య (25) ఇటీవల బీటెక్ పూర్తిచేసి పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లకూరు మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా అనతి కాలంలోనే స్నేహంగా మారి.. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో తేజ.. కావ్యతో చాలా సన్నిహితంగా..

చిత్తూరు, అక్టోబర్ 22: ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానని నమ్మబలికి దగ్గరయ్యాడు. తీరా పెళ్లి ఊసెత్తగానే కులం అడ్డుగా ఉందని నసగసాగాడు. దీంతో గుండె పగిలిన ఆ అబల ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉరి పెట్టుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో శనివారం (అక్టోబర్ 21) వెలుగు చూసింది. ఈ మేరకు మృతురాలి తల్లి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో నివాసం ఉంటోన్న భారతికి ఇద్దరు సంతానం. కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె కావ్య (25) ఇటీవల బీటెక్ పూర్తిచేసి పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లకూరు మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా అనతి కాలంలోనే స్నేహంగా మారి.. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో తేజ.. కావ్యతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మిన కావ్య తేజకు దగ్గరైంది. రెండేళ్ల వరకు వీరి ప్రేమ అలాసాగుతూ వచ్చింది.
అప్పుడప్పుడు తేజా వద్ద పెళ్లి విషయం ప్రస్తావించగా అతను ఏదో మాట దాట వేస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో తాజాగా కావ్య అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో అతని మోసం బయటపడింది. తనను పెళ్లి చేసుకోవడం వాళ్లింట్లో వాళ్లకు ఇష్టం లేదని, తమవి వేరే వేరు కులాలని చెప్పాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవడం కుదరదంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. ఈ విషయమై తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య శుక్రవారం రాత్రి ప్రియుడు తేజాకు ఫోన్ చేసింది. పెళ్లి చేసుకోమని చివరిసారిగా ప్రాధేయపడింది. అతను ససేమిరా అనడంతో ఇక తనకు చావే శరణ్యమని భావించింది. దీంతో కావ్య ప్రియుడు తేజాతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంట్లోని కుటుంబ సభ్యులకు కావ్య ఎంతకీ కనిపించకపోవడంతో అనుమానంతో ఇంటి మిద్దైపెకి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆమె గదిలో ఫ్యాన్‌కు ఉరి పెట్టుకుని విగత జీవిగా కనిపించింది. కావ్య ఫోన్ కాల్‌డేటా పరిశీలించిన తల్లి భారతి చివరి సారిగా ప్రియుడు తేజాతో మాట్లాడినట్లు గుర్తించింది. తన కూతురు మరణానికి తేజానే కారణం అంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కావ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీసధికారి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.