Weekend Hour: పవన్-లోకేష్ మీటింగ్ ఏజెండా ఏంటి? టీడీపీ-జనసేన ఒక్కటైతే, మరి బీజేపీ పరిస్థితేంటి?
Weekend Hour With Murali Krishna LIVE : ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు టీడీపీ- జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. లోకేష్, పవన్ అధ్యక్షతన రేపు రాజమండ్రిలో జరిగే తొలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. టీడీపీ- జనసేన ఉమ్మడిగా పోరాడితే.. మరి బీజేపీ వ్యూహమేంటి..? భవిష్యత్‌లోనైనా బీజేపీ కలిసొచ్చే అవకాశం ఉందా..?

Weekend Hour With Murali Krishna LIVE : ఉమ్మడి కార్యాచరణపై టీడీపీ- జనసేన ఫోకస్.. రేపు రాజమండ్రిలో జాయింట్ యాక్షన్ కమిటీ తొలి భేటీ.. టీడీపీ- జనసేన ఒక్కటైతే, మరి బీజేపీ పరిస్థితేంటి..?
టీడీపీ- జనసేన ఉమ్మడి కార్యాచరణ దిశగా కసరత్తు వేగవంతమైంది. ఇప్పటికే కమిటీ సభ్యులను నియమించిన ఇరు పార్టీలు.. వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించాయి. రేపు పవన్, లోకేష్ అధ్యక్షతన జరిగే భేటీలో ప్రస్తుత రాజకీయాలు, ఉమ్మడి పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉంది. జైలు నుంచి చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తూ ఉండడం కంటే.. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు.
ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తూనే.. ఉమ్మడిగా వెళ్దామనే ప్లాన్‌లో ఇరు పార్టీలు ఉన్నాయి. అయితే, ఆ ఉమ్మడి ప్రణాళికపై లోకేష్- పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.
టీడీపీ-జనసేన మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరి చేసుకుని ముందుకు వెళ్లాలని జనసేన శ్రేణులకు సూచించారు పవన్ కల్యాణ్. జనసేన- టీడీపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమన్నారు.
టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటిస్తే.. మరి బీజేపీ పరిస్థితేంటి..? ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమవుతుందా.. టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణకు వైసీపీ కౌంటర్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది చూడాలి.
వీకెండ్ హౌర్ విత్ మురళికృష్ణ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..