AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial Intelligence: వాయమ్మో.. ఏఐ క్రేజ్ మాములుగా లేదు.. ఒక్క క్లాస్ చెబితే ఏకంగా రూ.23 లక్షలా..?

ప్రపంచవ్యాప్తంగా ఏఐకు డిమాండ్ పెరిగిపోతుంది. ఏఐ వల్ల కొంతమంది ఉద్యోగాలు పోతుండగా.. కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ట్రైనర్లకు వరల్డ్ వైడ్‌గా డిమాండ్ పెరిగింది. వీళ్లు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక్కొ క్లాస్‌కు రూ.23 లక్షలు తీసుకుంటుండటం ఇప్పుడు బయటపడింది.

Artificial Intelligence: వాయమ్మో.. ఏఐ క్రేజ్ మాములుగా లేదు.. ఒక్క క్లాస్ చెబితే ఏకంగా రూ.23 లక్షలా..?
Artificial Intelligence
Venkatrao Lella
|

Updated on: May 26, 2026 | 4:13 PM

Share

టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ఎక్కడ బట్టినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు ఊడిపోతుండగా.. దీని వల్ల కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ట్రైనర్ల ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఏఐను ఎలా ఉపయోగించాలి..? ఏఐ ఉపయోగించి వేగంగా ఎలా పనిచేయాలి? అనేది కంపెనీలకు నేర్పిస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ప్రస్తుతం ఇలాంటి ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోయింది. కంపెనీలు కూడా వీరి సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

ఒక్కొ సెషన్‌కు రూ.23 లక్షలు

సాఫ్ట్‌బ్యాంక్ మాజీ పెట్టుబడిదారులైన ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్ గత ఏడాది వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్ అనే సంస్థను అమెరికాలో స్థాపించారు. బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లు, విశ్లేషకులకు చాట్‌జిపిటి, క్లాడ్, జెమిని వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి వేగంగా పనిచేయడం, కంపెనీలను మెరుగ్గా విశ్లేషించడంచ ఫైనాన్స్ రంగంలో పెరుగుతున్న ఏఐ మార్పును తట్టుకుని నిలబడటం ఎలాగో నేర్పిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. వీళ్లు ఒక్కో క్లాస్‌కు ఏకంగా 25 వేల డాలర్లు వసూలు చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో తెలిపింది. అంటే భారత కరెన్సీలో రూ.23 లక్షలు ఒక్కో క్లాస్‌కు తీసుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఏఐ ట్రైనర్లకు ఎంత డిమాండ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటంతో రెండు నెలలుగా వీళ్ల క్లాసుల కోసం వచ్చిన ఆర్డర్లు పేరుకుపోయాయి.

ఏం నేర్పిస్తారు..?

ఈ AI ట్రైనర్లు ఫైనాన్స్ నిపుణులకు వారి పనిలో అత్యంత సమయం తీసుకునే కొన్ని భాగాలను ఆటోమేట్ చేయడానికి AIని ఎలా ఉపయోగించాలనేది నేర్పిస్తారు. సెంటిమెంట్ విశ్లేషణను నిర్వహించేందుకు, యాజమాన్య వ్యాఖ్యలను స్ప్రెడ్‌షీట్ ఆధారిత ఆర్థిక అంచనాలుగా మార్చడానికి విశ్లేషకులు OpenAIకి చెందిన ChatGPT, Anthropicకు చెందిన Claude లను ఎలా ఉపయోగించవచ్చో చెబుతున్నారు. గతంలో ఒక కంపెనీని విశ్లేషించేందుకు గంటల కొద్ది సమయం పట్టేది. కానీ ఇప్పుడు నిమిషాల్లోనే పని పూర్తవుతుంది. ఏఐకు ప్రాంప్ట్ ఇవ్వగానే 90 సెకన్లలోనే కీలక అంశాలు అన్నీ తెలిసిపోతున్నాయి. ఫైనాన్స్ రంగంలో ఏఐ అనేది అవసరంగా మారుతోంది. ఏఐను ఉపయోగించలేదని ఉద్యోగులకు భవిష్యత్తులో ఉద్యోగాలు లభించకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ధిక సంస్థల్లో ఇప్పటికే ఏఐ తెలిసినవారికి, సాంప్రదాయ ఉద్యోగులకు మధ్య అంతరం వేగంగా పెరుగుతోంది. ఏఐ టూల్స్ డేటా ప్రాసెసింగ్, రీసెర్చ్ పనులను నిర్వహించగల సామర్ధ్యాన్ని వేగంగా పెంచుకుంటున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం గల ఉద్యోగులు 10,20 రెట్లు ఎక్కువ పనిని మెరుగ్గా, వేగంగా చేయవచ్చు.

Follow Us