క్యూట్ క్యూట్ చిన్నది.. శివాని అందానికి ఫిదా అవ్వాల్సిందే

Rajeev 

26 May  2026

instagram

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది.  ఈ చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది.

తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో ఈ అమ్మడు పేరు మారుమ్రోగింది. 

ఇటీవలే హే బలవంత్ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించాడు. 

నటిగానే కాకుండా సింగర్ కమ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1998లో హైదరాబాద్ లో జన్మించిన ఈ అమ్మడు చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది

విల్లా మేరీ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అంతర్గత అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ చేసింది.

ఇన్ స్టాలో చూసి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రంలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.