Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Sold her Husband: ‘శుభలగ్నం’ సీన్‌ రిపీట్.. భర్తను మరొక మహిళకు రూ.5 లక్షలకు విక్రయించిన భార్య

కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామంలో స్థానికంగా నివసం ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉండటం ఆ గృహిణి గుర్తించింది. భర్త తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా గృహిణి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊరందరినీ పిలిచి పంచాయితీ పెట్టింది. ఊరి పెద్దల ముందు గృహిణి తన భర్తను, అతని ప్రియురాలిని నేరుగా నిలదీసింది. ఈ క్రమంలో ఆడవాళ్లు ఇద్దరి మధ్య కొంత సమయం వాగ్వాదం జరిగింది...

Woman Sold her Husband: 'శుభలగ్నం' సీన్‌ రిపీట్.. భర్తను మరొక మహిళకు రూ.5 లక్షలకు విక్రయించిన భార్య
Woman Sold Her Husband
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 22, 2023 | 2:42 PM

మాండ్య, అక్టోబర్ 22: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా ‘శుభలగ్నం’ చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆ మువీలో హీరో జగపతి బాబు (భర్త)ను అతని భార్య ఆమని రూ. కోటికి బేరం పెడుతుంది. ఆమని భర్తను ప్రేమించిన రోజా రూ.కోటి చెల్లించి అతన్ని కొనుక్కుంటుంది. అనంతరం ఇద్దరు వివాహం చేసుకుని అదే ఇంట్లో కాపురం కూడా పెడతారు. అయితే రోజా కొన్ని రోజులకు డబ్బుకంటే మాంగళ్య బంధం గొప్పదని తెలుసుకున్న రోజా.. క్లైమాక్స్‌లో ఎలాగోలా భర్తను దక్కించుకోవడంతో శుభం కార్డు పడుతుంది. ఈ సినిమా ఇప్పటికీ తెలుగువాళ్లకు ఓ వింతే. అయితే శుభలగ్నం సినిమాలో మాదిరి రియల్‌ స్టోరీలో ఓ మహిళ తన భర్తను వేరే మహిళకు రూ.5 లక్షలకు విక్రయించింది. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని మాండ్యలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

కర్ణాటకలోని మండ్య సమీప ఓ గ్రామంలో స్థానికంగా నివసం ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉండటం ఆ గృహిణి గుర్తించింది. భర్త తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా గృహిణి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని ఊరందరినీ పిలిచి పంచాయితీ పెట్టింది. ఊరి పెద్దల ముందు గృహిణి తన భర్తను, అతని ప్రియురాలిని నేరుగా నిలదీసింది. ఈ క్రమంలో ఆడవాళ్లు ఇద్దరి మధ్య కొంత సమయం వాగ్వాదం జరిగింది.

భర్త ప్రియురాలు ‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించి.. నీ భర్తను తీసుకువెళ్లు’ అని గృహిణితో తెగేసి చెప్పింది. ఈ ఊహించని పరిణామానికి ఏ మాత్రం తత్తరపడకుండా గృహిణి కూడా.. ఇలాంటి భర్త నాకు అక్కరలేదు. నువ్వే రూ.5 లక్షల మనోవర్తి కింద నాకు చెల్లించి, అతన్ని నువ్వే ఉంచుకోవాలంటూ చెప్పింది. దీంతో రూ.5 లక్షల నగదు ఇచ్చేందుకు ప్రియురాలు అంగీకరించింది. మొత్తం నగదును ఒక నెల రోజుల్లో చెల్లిస్తానని, అందుకు గడువు ఇవ్వాలని ప్రియురాలు చెప్పగా వెంటనే ఆ మహా ఇల్లాలు అంగీకరించింది. దీంతో వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం చూసి గ్రామస్థులంతా అవాక్కయ్యారు. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏదిఏమైనా ఈ రోజుల్లో డబ్బు ముందు ఏ బంధం అయిన దిగదుడుపే. నిజమే కదా.. మీరేమంటారు?

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.