ఉడకబెట్టిన ప్రతిసారి గుడ్లు పగిలిపోతున్నాయా?.. ఈ టిప్స్ పాటిస్తే ఒక్కటి కూడా పాడవదు!

26  May 2026

Anand T

ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లను నేరుగా నీటిలో ఉడకబెట్టినప్పుడు అవి పగిలిపోవచ్చు. అందువల్ల, గుడ్లను గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత ఉడకబెడితే, అవి పగలవు.

మీ ఉడకపెట్టుప్పుడు గుడ్లు పగలకుండా ఉండటానికి, మరుగుతున్న నీటిలో ఒక చెంచా ఉప్పు లేదా వెనిగర్ కలపండి. ఇలా చేయడం ద్వారా గుడ్డు పగల కుండా చక్కగా ఉడుకుతాయి.

అయితే చాలా మంది ముందే గుడ్లను నీటిలో వేసి ఉడికిస్తారు. ముందుగా నీటిని మరిగించి, ఆ తర్వాత గుడ్లు వేయండం ద్వారా గుడ్లు పగలవు.

ఎందుకంటు నీరు అకస్మాత్తుగా మరిగే స్థాయికి చేరుకున్నప్పుడు, కంపనం కారణంగా గుడ్లు పగిలిపోవచ్చు. అందువల్ల, నీరు మరిగిన తర్వాత గుడ్లు వేయండి.

చాలా మంది ఎక్కవ మంట పెడితే గుడ్లు త్వరగా ఉండుకుతాయి అనుకుంటారు. కానీ మంటను మీడియం ప్లేమ్‌లో పెట్టి ఉడికిస్తే గుడ్లు పగలకుండా ఉడుకుతాయి.

ఉండికించేందుకు గుడ్లను నీటిలో వేసేప్పుడు నేరుగా వేయకండి. ఇలా చేయడం ద్వారా అవి పగిలిపోవచ్చు. కాబట్టి ఒక స్పూన్ సహాయంతో నెమ్మదిగా వేయండి.

గుడ్లను ఉడకడానికి దాదాపు 10-12 నిమిషాలు పడుతుంది. కాబట్టి, పెంకులు పగలకుండా ఉండటానికి ఆ సమయంలోపు స్టవ్‌ను ఆపేయండి.

గుడ్లు ఉడికిన తర్వాత, వాటిని చల్లటి నీటిలో వేయండి. ఇది గుడ్డు పెంకులను ఒలవడాన్ని సులభతరం చేస్తుంది ఈ సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీరు గుడ్లను పగిలి పోకుండానే ఉండకబెట్టవచ్చు.