వయ్యారాలు రెజీనా.. ఆచితూచి సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ
Rajeev
26 May 2026
instagram
రెజీనా కసాండ్రా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగాపరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రెజీనా పుటింది ముస్లిం కుటుంబంలో కానీ ఆతర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. కాగా గతంలో దీని పై రెజీనా క్లారిటీ ఇచ్చింది.
రెజీనా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాన్ని వెల్లడించింది.
ఓ ఇంటర్వ్యూలో నటి రెజీనా ముస్లింగా పుట్టిన తర్వాత క్రిస్టియన్‌గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. ఇద్దరిది లవ్ మ్యారేజ్. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆతర్వాత నేను క్రిస్టియన్‌గా మారిపోయాను
నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది.
14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది.