కెఫిన్ లేని కాఫీ.. ఖర్జూర గింజలతో ఇలా చేస్తే అదిరిపోద్దీ అంతే!
samatha
26 may 2026
కాఫీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి చాలా మంది చాలా ఇష్టంగా కాఫీని రోజూ తాగుతుంటారు.
కాఫీ
అయితే కొంత మందికి కాఫీ తాగడం ఇష్టం ఉన్నా, కెఫిన్ అధికంగా ఉంటుందని కాఫీకి దూరంగా ఉంటారు. అయితే అలాంటి వారికే ఈ గుడ్ న్యూస్.
కెఫిన్
మీకు కాఫీ తాగడం ఇష్టం ఉన్నా , కెఫిన్ కారణంగా తాగలేకపోతున్నారా? అయితే కెఫిన్ లేని కాఫీని ఇలా ఇంట్లోనే సింపుల్‌గా రెడీ చేసుకోండి.
కెఫిన్ లేని కాఫీ
దీని కోసం కావాల్సిన పదార్థాలు.. ఖర్జూరం గింజలు పది నుంచి 12 వరకు, అలాగే పాలు, బెల్లం రుచికి తగినంత, దాల్చిన చెక్క పొడి.
ఖర్జూరం గింజలు
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఖర్జూర గింజలు తీసుకొని బాగా క్లీన్ చేసి, వాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
తయారీ విధానం
తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో ఈ గింజలు వేసి బాగా వేయించుకోవాలి. అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
వేయించడం
ఇవి బాగా వేగిన తర్వాత కమ్మటి కాఫీ వాసన వస్తుంది. అప్పుడు మనం వాటిని మంచిగా పొడి చేసుకొని, గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
కాఫీ వాసన
తర్వాత మీరు రెగ్యులర్ కాఫీ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకొని, ఈ పౌడర్ వేసి వడబోసుకోవాలి. అంతే కెఫిన్ లేని కాఫీ రెడీ.