Woman Constable Shot Dead: ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉంటోందనీ.. మహిళ కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన భర్త!
ఉద్యోగం చేస్తున్న భార్య ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదన్న కోపంతో తుపాకితో కాల్చి చంపాడో భర్త. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పట్నాలో శుక్రవారం (అక్టోబర్ 21) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాలో జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్ కుర్తాలో కోచింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం శోభాకుమారి (23)తో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వీరి స్నేహం ప్రేమగా..
పట్నా, అక్టోబర్ 23: ఉద్యోగం చేస్తున్న భార్య ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదన్న కోపంతో తుపాకితో కాల్చి చంపాడో భర్త. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పట్నాలో శుక్రవారం (అక్టోబర్ 21) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాలో జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్ కుర్తాలో కోచింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం శోభాకుమారి (23)తో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వీరి స్నేహం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శోభ ఇటీవలే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరింది. బీహార్ మిలటరీ పోలీస్ (బీఎంపీ)కి చెందిన 2022 బ్యాచ్ కానిస్టేబుల్ శోభా కుమారి విధి నిర్వహణలో అధిక సమయం గడపడం లేదని భర్త గజేంద్ర కుమార్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఉద్యోగం మానేయాలని ఆమెను వేధించేవాడు. అందుకు శోభా కుమారి నిరాకరించడంతో గజేంద్ర ఆమెపై కోపం పెంచుకున్నాడు.
శుక్రవారం శోభా కుమారి పుట్టిన రోజు కావడంతో సోరా గ్రామంలో నివాసముంటున్న శోభా కుమారి తల్లిదండ్రులు పాట్నాలోని కూతురు ఇంటికి వచ్చి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గజేంద్ర స్థానికంగా ఓ హోటల్‌లో గది బుక్ చేసి భార్యను అక్కడకు రావాల్సిందిగా కోరాడు. అక్కడా ఇద్దరూ వాదులాడుకొన్నారు. కోపంతో ఊగిపోయిన గజేంద్ర తుపాకితో భార్యను కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హోటల్ గదిలోని శోభా కుమారి మృతదేహంతోపాటు రెండు పిస్టల్స్, నాలుగు కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కూతురు కోసం ఎదురు చూస్తున్న శోభా తల్లిదండ్రులు ఆమె మరణ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించగా ఎట్టకేలకు పట్టుకుని కటకటాల వెనుక వేశారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. ఉద్యోగం కారణంగా తనతో, తన నాలుగేళ్ల కుమార్తెతో సరిగ్గా సమయం గడపలేదనే కోపంతోనే భార్యను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. గజేంద్రకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కాగా గతంలోనే గజేంద్ర కుమార్‌కు మైనర్‌గా ఉన్నప్పుడు తన స్వగ్రామమైన సాతాన్‌పూర్‌లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు బలవంతంగా అతనికి వివాహం చేశారు. వివాహానంతరం మొదటి భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.