ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యను భారత్ పరిష్కరించాలి.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. దాడులపై ముస్లిం దేశాలు ఎందుకు నోరుమెదపడం లేదన్న ఆయన.. ఇప్పటికైనా ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం మాట్లాడాలన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇతిహాదుల్ ముస్లీమీన్ (ఎంఐఎం) బహిరంగ సభలో హైదరాబాద్ ఎంపీ మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఎత్తున పాలస్తీన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. దాడులపై ముస్లిం దేశాలు ఎందుకు నోరుమెదపడం లేదన్న ఆయన.. ఇప్పటికైనా ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం మాట్లాడాలన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇతిహాదుల్ ముస్లీమీన్ (ఎంఐఎం) బహిరంగ సభలో హైదరాబాద్ ఎంపీ మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఎత్తున పాలస్తీన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాలస్తీన్ పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా నిర్వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ముస్లిం మత పెద్దల హాజరయ్యారు.
పాలస్తీనాకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలస్తీనాపై ఏళ్లుగా దాడులు జరుగుతున్నాయన్న ఆయన.. ఇప్పటికైనా పాలస్తీనాకు న్యాయం జరగాలన్నారు. గాజాపై ఇజ్రాయెల్ హీనంగా వ్యవహరిస్తుందన్న వారు.. దాడులతో పాలస్తీనా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దాడులకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రొడక్ట్స్ ను ఎవరు వాడకూడదని మత పెద్దలు ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు ముస్లిం దేశాలలో ఇజ్రాయిల్ వస్తువులను బైకాట్ చేసినట్టు మత పెద్దలు వివరించారు.
ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు ఏకీతాటిపై వచ్చి పాలస్తీనాకు అండగా నిలిచి ధైర్యం చెప్పాలని ముస్లిం మత పెద్దలు కోరారు. ఇజ్రాయిల్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని మత పెద్దలు ముస్లిం దేశాలని కోరారు. ఇక ఇజ్రాయిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నిరసన సభకు ఎంపీ ఆసదుద్దీన్ ఓవైసీ పిలుపునివ్వడంతో.. దూరప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నగరంలోని పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలతో పాటు మహిళలు కూడా ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు ఇజ్రాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో పలు రాజకీయ పార్టీల నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
