Andhra Pradesh: విందులో కుర్చీ తెచ్చిన తంట! చితక్కొట్టుకున్న గ్రామస్థులు
ఓ పోలీస్ సమీప బంధువుల శుభకార్యానికి తోటి పోలీసు సిబ్బంది హాజరయ్యారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విందులో కూర్చీ విషయమై స్థానిక వ్యక్తితో హెడ్ కానిస్టేబుల్ గొడవపడ్డాడు. దీంతో తోటి పోలీసులంతా కలిసి ఆ స్థానికుడు, అతని తమ్ముడిపై దాడికి తెగబడ్డారు. తాము పోలీసధికారులం అనే విషయమే మర్చిపోయి గల్లీ రౌడీల్లా ఆ ఇద్దరినీ చితకబాదారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయాలపాలవ్వగా ఈ విషయం కాస్తా ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
గన్నవరం, అక్టోబర్ 23: ఓ పోలీస్ సమీప బంధువుల శుభకార్యానికి తోటి పోలీసు సిబ్బంది హాజరయ్యారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విందులో కూర్చీ విషయమై స్థానిక వ్యక్తితో హెడ్ కానిస్టేబుల్ గొడవపడ్డాడు. దీంతో తోటి పోలీసులంతా కలిసి ఆ స్థానికుడు, అతని తమ్ముడిపై దాడికి తెగబడ్డారు. తాము పోలీసధికారులం అనే విషయమే మర్చిపోయి గల్లీ రౌడీల్లా ఆ ఇద్దరినీ చితకబాదారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయాలపాలవ్వగా ఈ విషయం కాస్తా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం (అక్టోబర్ 22) ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గన్నవరంలోని స్థానిక గౌడపేటలో వస్త్రాలంకరణ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విందు ఏర్పాటు చేశారు. అక్కడికి స్థానికులు పామర్తి శ్రీకాంత్, చిన్నారావు అనే ఇద్దరు వ్యక్తులు కూడా హాజరయ్యారు. విందు వద్ద కుర్చీ విషయమై వీరిరువురికి మాటామాటా పెరిగింది. దీంతో ఒకరినొకరు వాదులాడుకున్నారు. అనంతరం పరస్పరం దాడికి దిగారు. వీరిలో చిన్నారావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న మరొక సిబ్బంది తోడళ్లుడు ఫంక్షన్ అది. దీంతో చిన్నారావుతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది యూనీఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో అక్కడే భోజనానికి వచ్చారు.
అక్కడ గొడవ ముదరడంతో శ్రీకాంత్ సోదరుడు వెంకటేష్ అక్కడికి వచ్చి వారికి సర్దిచెబుతున్నాడు. ఇంతలో చిన్నారావు గొడవ పడటం చూసిన తోటి పోలీసు సిబ్బంది అందరూ శ్రీకాంత్‌తో పాటు అతని సోదరుడు వెంకటేష్‌పై దాడి చేసి చితకబాదారు. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో శ్రీకాంత్, వెంకటేష్‌కు స్వల్ప గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్ సోదరుడు వెంకటేష్ పట్ల హెడ్‌కానిస్టేబుల్ చక్రవర్తి ప్రవర్తించిన తీరు పోలీసు శాఖకే అమానకరంమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు మీడియాకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.