AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే వేదిక: విజయవాడ, విశాఖలోనూ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026

టీవీ9 నెట్‌వర్క్ జాతీయ విద్యా కార్యక్రమాలలో భాగంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026ను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. అనంతరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల ఎక్స్‌పోకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలు, వెబ్ కౌన్సెలింగ్ మార్గదర్శకత్వంపై వేలాది మంది విద్యార్థులు నిపుణుల సలహాలు పొందారు.

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే వేదిక: విజయవాడ, విశాఖలోనూ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026
TV9 KAB Education Expo
Srilakshmi C
|

Updated on: May 26, 2026 | 1:11 PM

Share

విజయవాడ, మే 26: హైదరాబాద్ లో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అదే ఉత్సాహంతో TV9 & KAB Education Expo 2026 విజయవాడలో మే 30 & 31 తేదీల్లో SS Convention Centre, లబ్బీపేటలో, విశాఖపట్నంలో మే 31, 2026న Novotel Visakhapatnam, డాక్టర్ NTR బీచ్ రోడ్‌లో నిర్వహించనున్నారు.

TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్యా అవకాశాలు, సరైన కోర్సుల ఎంపిక, కెరీర్ మార్గదర్శకత్వంపై సమగ్ర అవగాహన కల్పించనుంది. తెలుగు రాష్ట్రాల్లో TV9తో కలిసి, దాదాపు రెండు దశాబ్దాలుగా విద్యార్థులకు కెరీర్ ప్లానింగ్, సరైన కోర్సులు, కాలేజీల ఎంపిక, ఉన్నత విద్య అవకాశాలపై మార్గదర్శకత్వం అందిస్తూ వేలాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని సంపాదించిన KAB Educational Consultants ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతోంది. ఈ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు, డీమ్డ్ టు బీ యూనివర్సిటీలు పాల్గొననున్నాయి. ఇంజినీరింగ్, Aviation, మెడిసిన్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, లా, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మీడియా, డిజైన్, హోటల్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ తదితర విభాగాలకు సంబంధించిన కోర్సులపై విద్యార్థులు పూర్తి సమాచారం పొందవచ్చు.

ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి ఉచిత నిపుణుల కౌన్సెలింగ్. విద్యార్థుల అర్హతలు, ఆసక్తులు, పరీక్ష ఫలితాల ఆధారంగా సరైన కోర్సులు, కాలేజీల ఎంపికపై నిపుణులు ప్రత్యక్షంగా సలహాలు అందించనున్నారు. అలాగే AP-EAPCET, NEET, JEE, ICET, JoSAA వంటి ప్రధాన ప్రవేశ పరీక్షల అనంతరం వెబ్ కౌన్సెలింగ్ విధానం, కోర్సుల ఎంపికపై కూడా ప్రత్యేక మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ఎక్స్‌పోను సందర్శించి విద్యా అవకాశాలు, అడ్మిషన్ ప్రక్రియలు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై స్పష్టత పొందవచ్చు. ఒకే వేదికపై సమగ్ర విద్యా సమాచారం, నిపుణుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉండటం ఈ ఎక్స్‌పో ప్రత్యేకత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రణాళికలకు దిశానిర్దేశం చేస్తున్న TV9 & KAB Education Expo 2026, విద్యార్థుల కెరీర్ ప్రయాణంలో కీలక వేదికగా నిలుస్తోంది. అన్నట్లు ఈ ఎక్స్‌పోకు వచ్చే విద్యార్ధులు, తల్లిదండ్రులు అందరికీ ప్రవేశం పూర్తిగా ఉచితం.

పూర్తి షెడ్యూల్‌ ఇదే..

విజయవాడలో..

  • విజయవాడ వేదిక: SS Convention Centre, లబ్బీపేట
  • తేదీలు: మే 30 & 31, 2026
  • సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు

విశాఖపట్నంలో..

  • విశాఖపట్నం వేదిక: Novotel Visakhapatnam, Dr. NTR Beach Road
  • తేదీ: మే 31, 2026
  • సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
  • ప్రవేశం పూర్తిగా ఉచితం

Follow Us