YouTube videos: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తులు.. యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేసి రూ.73 లక్షలు పోగొట్టుకున్నారు

యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేస్తే చాలు.. సులువుగా డబ్బు సంపాదించవచ్చంటూ ఓ ముఠా భారీ ఎత్తున మోసాలకు పాల్పడింది. భారీ మొత్తంలో డబ్బు ఆర్జించ‌వ‌చ్చని మభ్యపెట్టి ప‌లువురి నుంచి దాదాపు రూ.73 ల‌క్షలు కొల్లగొట్టారు. యూట్యూబ్, మోజ్ యాప్‌ల ద్వారా ఈ గ్యాంగ్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడింది. రంగంలోకి దిగిన సైబర్‌ పోలీసులు వీరి గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో ఒకడైనా హ‌రియాణాకు చెందిన సోనేప‌ట్‌కు చెందిన అజ‌య్‌ కుమార్‌ (28)ను పోలీసులు..

YouTube videos: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తులు.. యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేసి రూ.73 లక్షలు పోగొట్టుకున్నారు
Youtube Online Fraud
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2023 | 7:31 AM

గురుగావ్‌, అక్టోబర్‌ 24: యూట్యూబ్ వీడియోల‌ను లైక్ చేస్తే చాలు.. సులువుగా డబ్బు సంపాదించవచ్చంటూ ఓ ముఠా భారీ ఎత్తున మోసాలకు పాల్పడింది. భారీ మొత్తంలో డబ్బు ఆర్జించ‌వ‌చ్చని మభ్యపెట్టి ప‌లువురి నుంచి దాదాపు రూ.73 ల‌క్షలు కొల్లగొట్టారు. యూట్యూబ్, మోజ్ యాప్‌ల ద్వారా ఈ గ్యాంగ్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడింది. రంగంలోకి దిగిన సైబర్‌ పోలీసులు వీరి గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో ఒకడైనా హ‌రియాణాకు చెందిన సోనేప‌ట్‌కు చెందిన అజ‌య్‌ కుమార్‌ (28)ను పోలీసులు గురుగ్రాంలో అరెస్ట్ చేశారు. ఎలా మోసాలకు పాల్పడే వారంటే..

తొలుత నిందితుడు అజ‌య్‌ తన వాట్సప్‌ గ్రూప్‌ నుంచి లింక్‌ను షేర్‌ చేసేవాడు.యూట్యూబ్ లేదా మోజ్ యాప్‌లోని కంటెంట్‌ను ‘లైక్’ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని గ్రూప్‌లోని వారిని నమ్మించేవాడు. ఆ లింక్ క్లిక్‌ చేశాక తొలుత కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలని నిందిడుతు అజ‌య్‌ వారిని అడిగేవాడు. నిందితుడి మాయ మాటలను పూర్తిగా నమ్మిన బాధితుడు రూ. 10.20 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత నిందితుడు అజ‌య్‌ పత్తాలేకుండా పోయేవాడు. ఇలా మరికొందరిని మోసం చేసి పెద్దమొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇత‌ర నిందితుల బ్యాంకు ఖాతాల‌కూ డ‌బ్బు చేర‌వేశాడు.

దీనిపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయగా తూర్పు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడ ఇన్‌స్పెక్టర్ జస్వీర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం అజయ్‌ను గుర్తించి అరెస్టు చేసింది. బాధితురాలి నుంచి మోసపూరితంగా నొక్కేసిన రూ.6.80 లక్షలను తన సహచరుడి ఆదేశాల మేరకు అతని బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసినట్లు అజయ్‌ విచారణలో అంగీకరించాడు. ఈ ఆపరేషన్‌లో తన వంతుగా రూ.50 వేలు కమీషన్ అందుకున్నట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇక యూట్యూబ్ లైక్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చనే యూట్యూబ్‌ స్కామ్‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 69 ఫిర్యాదులు అందినట్లు ACP (క్రైమ్) వరుణ్ దహియా వివరించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ములో సుమారు రూ.73 లక్షలు నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. ఈ స్కామ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను పూర్తి విచారణ అనంతరం బయటపెడతామని అన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు. అనుచిత మెసేజ్‌లు, లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని, త్వరితంగా డబ్బు సంపాదించవచ్చని వచ్చే ఇమెయిల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వ్యక్తులకు లేదా ఖాతాలకు డబ్బు పంపవద్దని మీడియా ద్వారా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.