Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!

Post Office: పోస్టాఫీసులో అనేక రకాల సేవింగ్‌ స్కీమ్స్‌, ఇతర స్కీమ్స్  అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు పోస్టాల్‌ శాఖలో ఎన్నో పథకాలను అందుబాటుకి వస్తున్నాయి. చాలా మందికి పోస్టాఫీసులో ఉండే కొన్ని స్కీమ్‌ల గురించి తెలియవు. అయితే పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. పీపీఎఫ్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు.

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2023 | 6:23 AM

Post Office:  పోస్టాఫీసులో అనేక రకాల సేవింగ్‌ స్కీమ్స్‌, ఇతర స్కీమ్స్  అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు పోస్టాల్‌ శాఖలో ఎన్నో పథకాలను అందుబాటుకి వస్తున్నాయి. చాలా మందికి పోస్టాఫీసులో ఉండే కొన్ని స్కీమ్‌ల గురించి తెలియవు. అయితే పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. పీపీఎఫ్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు.

పీపీఎఫ్‌పై వడ్డీ రేటు:

కాగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతా ఓపెన్‌ చేసుకోవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే పీపీఎఫ్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికం వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. లేదంటే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకపోతే అలాగే స్థిరంగా కూడా కొనసాగించొచ్చు. పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అయితే అవసరం అనుకుంటే ఈ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం.. మీరు రోజుకు రూ.300 ఆదా చేసి.. నెల చివరిలో రూ.9 వేలను పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మీరు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే రూ.కోటీశ్వరులు అవుతారు. ఇలాంటి స్కీమ్‌ల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు వెళితే చెబుతారు.

నోట్: ఇది బిజినెస్ నిపుణుల సలహాలు, సూచనలు మేరకు ప్రచురించబడిన ఆర్టికల్.. మీరు దేనిలోనైనా డబ్బులు పెట్టే ముందు బిజినెస్ విశ్లేషకులను తప్పనిసరిగా సంప్రదించండి. 

ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి