Cello World: మదుపరులకు శుభవార్త.. సెల్లో వరల్డ్ ఐపీఓ ప్రారంభం.. మూడు రోజులే చాన్స్
తాజాగా పెట్టుబడిదారులు కొత్త ఆదాయ అవకాశాన్ని పొందబోతున్నారని మార్కెట్ నిపుణుల మాట. గృహోపకరణాలతో పాటు స్టేషనరీ తయారీదారు సెల్లో వరల్డ్ లిమిటెడ్‌కు సంబంధించిన రూ.1,900 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అక్టోబర్ 30న ప్రారంభమవుతుంది. ఈ ఇష్యూ నవంబర్ 1న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు అక్టోబర్ 27న షేర్ల కోసం వేలం వేసే అవకాశం ఉంటుంది. సెల్లో వరల్డ్ ఐపీఓ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ధనం మూలం ఇదం జగత్.. డబ్బుతో సమాజంలో హోదాతో పాటు గౌరవం వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ రూపాయి..రూపాయి కూడబెట్టి సమాజంలో గౌరవంగా బతుకుతూ ఉంటారు. అయితే కొంత మంది స్థిర ఆదాయం వచ్చే ఎఫ్‌డీతో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటే మరికొంత మంది మాత్రం రిస్క్ తీసుకుని షేర్లల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి పెట్టుబడి నికర ఆదాయాన్ని అందిస్తాయని నమ్మకం లేదు. కాకపోతే ఒక్కోసారి అన్నీ కలిసి వస్తే నమ్మలేని ఆదాయం కూడా పొందవచ్చు. అలాగే పెద్దపెద్ద కంపెనీలు కూడా వ్యాపార విస్తరణ కోసం కొన్ని షేర్లు పబ్లిక్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతుంటాయి. తాజాగా పెట్టుబడిదారులు కొత్త ఆదాయ అవకాశాన్ని పొందబోతున్నారని మార్కెట్ నిపుణుల మాట. గృహోపకరణాలతో పాటు స్టేషనరీ తయారీదారు సెల్లో వరల్డ్ లిమిటెడ్‌కు సంబంధించిన రూ.1,900 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అక్టోబర్ 30న ప్రారంభమవుతుంది. ఈ ఇష్యూ నవంబర్ 1న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు అక్టోబర్ 27న షేర్ల కోసం వేలం వేసే అవకాశం ఉంటుంది. సెల్లో వరల్డ్ ఐపీఓ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సెల్లో వరల్డ్ ఇష్యూ పూర్తిగా ప్రమోటర్లు, ఇతర వాటాదారులతో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)పై ఆధారపడి ఉంటుంది. ఇందులో అర్హులైన ఉద్యోగులకు రూ.10 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్‌లో ఉంచారు. ఓఎఫ్‌స్‌ఓ పంకజ్ ఘిసులాల్ రాథోడ్, గౌరవ్ ప్రదీప్ రాథోడ్, ప్రదీప్ ఘిసులాల్ రాథోడ్, సంగీత ప్రదీప్ రాథోడ్, బబితా పంకజ్ రాథోడ్, రుచి గౌరవ్ రాథోడ్ ద్వారా ఈక్విటీ షేర్ల విక్రయం ఉంటుంది. ముంబయికి చెందిన సెల్లో వరల్డ్ మూడు కీలక విభాగాలలో ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వినియోగదారు గృహోపకరణాలు, రాత పరికరాలతో పాటు స్టేషనరీ, మౌల్డింగ్‌ఫర్నిచర్ సంబంధిత ఉత్పత్తుల్లో ఉంది.
2017లో ‘సెల్లో’ బ్రాండ్‌తో గ్లాస్‌వేర్, ఒపాల్ వేర్ వ్యాపారంలోకి ప్రవేశించింది. డామన్, హరిద్వార్ (ఉత్తరాఖండ్), బద్ది (హిమాచల్ ప్రదేశ్), చెన్నై (తమిళనాడు), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) అనే ఐదు ప్రదేశాలలో కంపెనీకి 13 తయారీ యూనిట్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఏకీకృత ఆదాయం 32.2 శాతం పెరిగి రూ. 1,796.69 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,359.18 కోట్లుగా ఉంది. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లకు చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి