Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?

రానున్న రోజుల్లో దీపావళి ఉండడం, పెళ్లిళ్ల సీజన్‌ కూడా ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం మరోసారి గోల్డ్ ధరలో పెరుగుద కనిపించింది. మంగళవారం తులం బంగారంపై రూ. 200కి పైగా తగ్గిందని సంతోషించేలోపే, బుధవారం (నేడు) గోల్డ్ ధర పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చింది. బుధవారం దేశవ్యాప్తంగా అన్ని...

Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?
Gold RateImage Credit source: TV9 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2023 | 6:31 AM

దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో దీపావళి ఉండడం, పెళ్లిళ్ల సీజన్‌ కూడా ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం మరోసారి గోల్డ్ ధరలో పెరుగుద కనిపించింది. మంగళవారం తులం బంగారంపై రూ. 200కి పైగా తగ్గిందని సంతోషించేలోపే, బుధవారం (నేడు) గోల్డ్ ధర పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చింది. బుధవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

* దేశ రాజధానిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,840గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,750కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,910గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్ఢ్‌ ధర రూ. 61,690గా ఉంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

* పుణెలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 61,690గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,690గా ఉంది.

* నిజమాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 61,690గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా బుధవారం అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 500 తగ్గి రూ. 74,600వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర అత్యధికంగా రూ. 78,000వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..