Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack To DSP: జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా గుండెపోటుతో DSP మృతి.. ఎక్కడంటే?

వయసుతో సంబంధం లేకుండా యువత హాట్‌ ఎటాక్‌తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. జిమ్‌ చేస్తూ, రోడ్డుపై నడుస్తూ, మెట్లు ఎక్కుతూ ఇలా ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలి యువత మృతి చెందుతున్నారు. తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్‌లో కసరత్తు చేస్తుండ‌గా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. జిమ్‌ సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా..

Heart Attack To DSP: జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా గుండెపోటుతో DSP మృతి.. ఎక్కడంటే?
Haryana DSP Joginder Deswal
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2023 | 9:07 AM

పానిపట్‌, అక్టోబర్‌ 24: వయసుతో సంబంధం లేకుండా యువత హాట్‌ ఎటాక్‌తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. జిమ్‌ చేస్తూ, రోడ్డుపై నడుస్తూ, మెట్లు ఎక్కుతూ ఇలా ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలి యువత మృతి చెందుతున్నారు. తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్‌లో కసరత్తు చేస్తుండ‌గా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. జిమ్‌ సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘ‌ట‌న హ‌ర్యానాలోని పానిప‌ట్‌లో సోమ‌వారం ఉద‌యం (అక్టోబర్ 23) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హర్యానాలోని పానిప‌ట్ జిల్లా జైలులో పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ జోగిందర్ దేస్వాల్ విధులు నిర్వహిస్తున్నారు. జోగింద‌ర్ దేశ్వాల్ సోమ‌వారం ఉద‌యం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ చేస్తూనే ఒక్కసారిగా ఆయ‌న కుప్ప కూలిపోయారు. దీంతో జిబ్‌ సిబ్బంది పోలీసు ఆఫీస‌ర్‌ను చికిత్స నిమిత్తం కర్నాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్కడ జోగింద‌ర్ దేశ్వాల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా జోగింద‌ర్ దేశ్వాల్‌ కర్నాల్‌లోని న్యాయపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన జిమ్‌లో వర్కౌట్‌ చేయడానికి వెళ్లి విగత జీవిగా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇక డీఎస్పీ జోగింద‌ర్ మృతితో హ‌ర్యానా పోలీసు శాఖ‌లో విషాదం నెల‌కొంది. ఆయ‌న మృతిప‌ట్ల పోలీసు శాఖ‌ అధికారులు, జైలు సిబ్బంది నివాళుల‌ర్పించారు.

జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం ఇదేం తొలిసారి కాదు. గత సెప్టెంబరు నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వ్యక్తి జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌ చేస్తూ కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆగస్టులో కూడా ఇండోర్‌లోని జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.