AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌ ఘటన: ర్యాష్ డ్రైవింగ్‌తో యువకుడి భీభత్సం.. 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ విద్యార్ధి

రోడ్డుపై యువ‌కుడు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ స్కూల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు దాటుతున్న స్టూడెంట్‌ను అమాంతంగా బైక్ తో ఢీ కొట్టడంతో విద్యార్ధి 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ షాకింగ్‌ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో..

షాకింగ్‌ ఘటన: ర్యాష్ డ్రైవింగ్‌తో యువకుడి భీభత్సం.. 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ విద్యార్ధి
Coimbatore Road Accident
Srilakshmi C
|

Updated on: Oct 24, 2023 | 8:31 AM

Share

చెన్నై, అక్టోబర్‌ 24: రోడ్డుపై యువ‌కుడు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ స్కూల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు దాటుతున్న స్టూడెంట్‌ను అమాంతంగా బైక్ తో ఢీ కొట్టడంతో విద్యార్ధి 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ షాకింగ్‌ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో అభిరామి థియేట‌ర్ వ‌ద్ద ఓ స్కూల్ స్టూడెంట్ రోడ్డు దాటుతున్నాడు. అదే స‌మ‌యంలో అటుగా బ‌స్సు వ‌చ్చింది. బస్సును ఓవర్‌టేక్ చేసేందుకు మోటర్‌బైక్ వాహనాదారుడు ప్రయత్నించాడు. బైక్‌ను గమనించని విద్యార్ధి బస్సు వచ్చేలోపు రోడ్డుదాటాలని ప్రయత్నించాడు. ఇంతలో బైక్‌ అదుపుతప్పి రోడ్డు దాటుతోన్న విద్యార్ధిని బలంగా ఢీకొట్టాడు. దీంతో విద్యార్ధి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు గాయపడిన విద్యార్థిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక బైక్ నడుపిన యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. నిర్లక్ష్యంగా బైక్ న‌డిపిన యువ‌కుడిని న‌జీర్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని నిందితుడు న‌జీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ప్రమాదానికి కారణమైన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు