AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Tips: చిన్న ఏజ్ లోనే జుట్టుకు కలర్ వేసుకుంటున్నారా.. ఈ నేచురల్ పద్దతులతో నల్లగా మార్చేయండి!

ముసలితనంలో జుట్టు తెల్లబడితే ఆమోదయోగ్యమైనది. అదే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తే ఖచ్చితంగా దీన్ని ఎవరూ ఒప్పుకోలేరు. ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ చిన్న ఏజ్ లోనే జుట్టు తెల్ల బడిపోతుంది. ఇలా జుట్టు తెలబడటానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా.. కారణం ఏదైనా అందాన్ని పాడు చేయడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందులోనూ పెళ్లి కాకుండానే జుట్టు..

Hair Tips: చిన్న ఏజ్ లోనే జుట్టుకు కలర్ వేసుకుంటున్నారా.. ఈ నేచురల్ పద్దతులతో నల్లగా మార్చేయండి!
Hair Tips
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 25, 2023 | 9:36 PM

Share

ముసలితనంలో జుట్టు తెల్లబడితే ఆమోదయోగ్యమైనది. అదే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తే ఖచ్చితంగా దీన్ని ఎవరూ ఒప్పుకోలేరు. ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ చిన్న ఏజ్ లోనే జుట్టు తెల్ల బడిపోతుంది. ఇలా జుట్టు తెలబడటానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా.. కారణం ఏదైనా అందాన్ని పాడు చేయడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందులోనూ పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడితే ఇక అంతే సంగతులు. నలుగురిలో వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తెల్ల జుట్టును చూసిన అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. దీంతో చాలా మంది హెయిర్ కి కలర్ వేస్తూ ఉంటున్నారు. అలా కాకుండా కొన్ని రకాల నేచురల్ టిప్స్ తో మీ జుట్టు నల్లగా మారుతుంది.

అదే విధంగా మీరు తీసుకునే ఆహార విషయంలో కూడా మార్పులు చేయాల్సి ఉంది. ఆకు పచ్చ కూరలు, కాయగూరలు, పెరుగు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు తొందరగా తెల్లబడదు. ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి ఇంట్లోనే సహజ సిద్ధంగా లభ్యమయ్యే వాటితోనే జుట్టును ఎలా నల్లగా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి – మెంతి హెయిర్ మాస్క్:

ఇవి కూడా చదవండి

ఒక చిన్న గిన్నెలోకి ఉసిరి పొడి అందులోకి కొద్దిగా మెంతిని పొడిని తీసుకుని రెండు బాగా కలుపుకోవాలి. ఇందులో సరిపడినన్ని నీళ్లు వేసుకుని.. పేస్ట్ లా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి.. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం లేచాక షాంపూతో హెయిర్ ని వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేసినా సరిపోతుంది. ఉసిరి, మెంతి పొడి వల్ల జుట్టు నల్లబడటమే కాకుండా స్ట్రాంగ్ తయారవుతుంది.

కరివేపాకు – కొబ్బరి నూనె:

ఒక మందపాటి పాత్రలోకి కొబ్బరి నూనెను తీసుకుని అందులో కొన్ని కరివేపాకులు వేసి బాగా మరిగించాలి. కరివేపాకులు నల్లబడేంత వరకూ ఈ నూనెని మరిగించాలి. ఈ నూనె చల్లబడిన తర్వాత ఫిల్టర్ చేసి.. కుదుళ్లకు బాగా పట్టించి, కాసేపు మర్దనా చేసుకోవాలి. ఉదయం లేచాక తల స్నానం చేయాలి. ఇలా చేస్తే తెల్ల బడిన జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా హెయిర్ బలంగా తయారవుతుంది.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.