AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth Health: మీ దంతాల రంగు బట్టి.. మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు!

దంతాల రంగును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. పళ్లు మిలమిల మెరిసిపోవాలని అనుకోని వారుండరు. దంతాల కారణంగా చాలా మంది నలుగురిలో నవ్వడానికి కూడా సిగ్గు పడుతూంటారు. ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. పళ్లు ఒక్కోసారి నలుపుగా, పసుపు రంగులోకి, బ్రౌన్ కలర్ లోకి మారుతూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి దంతాలు అనేవి సెన్సిటీవిటీకి కూడా గురవుతూంటాయి. దీని కారణంగా వేడి లేదా చల్లగా ఉన్న పదార్థాలను తినలేరు..

Teeth Health: మీ దంతాల రంగు బట్టి.. మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు!
Teeth
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 25, 2023 | 8:30 AM

Share

దంతాల రంగును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. పళ్లు మిలమిల మెరిసిపోవాలని అనుకోని వారుండరు. దంతాల కారణంగా చాలా మంది నలుగురిలో నవ్వడానికి కూడా సిగ్గు పడుతూంటారు. ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. పళ్లు ఒక్కోసారి నలుపుగా, పసుపు రంగులోకి, బ్రౌన్ కలర్ లోకి మారుతూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి దంతాలు అనేవి సెన్సిటీవిటీకి కూడా గురవుతూంటాయి. దీని కారణంగా వేడి లేదా చల్లగా ఉన్న పదార్థాలను తినలేరు.. తాగలేరు. బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల, సరిగ్గా మౌత్ వాష్ చేయకపోవడం వల్ల కూడా దంతాలు రంగు మారుతూ ఉంటాయి. ఇలా బ్యాక్టీరియా కూడా చేరి దంతాలు పాడవుతాయి. అయితే ఇలా పళ్లను రంగు బట్టి.. మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో.. మీ దంతాలు ఏ రంగులో ఉన్నాయో తెలుసుకోండి.

పసుపు రంగు:

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ పళ్లు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఉపరితలంపై ఉన్న ఎనామెల్ కాలక్రమేణా పసుపు రంగును బహిర్గతం చేస్తుంది. అలాగే ఆహారపు అలవాట్ల కారణంగా కూడా దంతాలు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎక్కువగా కాఫీ, టీ, సోయా సాస్ తిన్నప్పుడు ఈ మరకలు ఏర్పడతాయి. పసుపు రంగుతో ఇబ్బంది పడుతున్న వారు దంతాలను ఉదయం, రాత్రి శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

బూడిద రంగు:

దంతాల్లో రక్త సరఫరా లేకపోవడం వల్ల పళ్లు బూడిద రంగులోకి మారతాయి. దంతాలకు గాయం అయినప్పుడు లేదా నరాల నష్టం జరిగినప్పుడు ఇలా గ్రే కలర్ లోకి వస్తాయి. కావిటీస్ పూరించడానికి ఉపయోగించే పదార్థం కూడా దంతాలను బూడిద రంగులోకి మార్చగలవు. ఇలా పళ్లు ఈ కలర్ లోకి మారితే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.

పర్పుల్ కలర్:

రెడ్ వైన్ ఎక్కువగా తాగినప్పుడు దంతాలు నార్మల్ గా ఊదా రంగులోకి మారతాయి. అలాగే బెర్రీలు, దానిమ్మ వంటి పండ్లు తిన్నప్పుడు కూడా ఇలా పర్పుల్ కలర్ లోకి దంతాలు మారతాయి. ఇలా దంతాలు ఈ కలర్ లోకి మారితే అంతర్గతంగా రక్త స్రావాన్ని సూచిస్తుంది.

నలుపు:

దంతాలు ఎప్పుడైతే నలుపు రంగులోకి వచ్చాయో.. అవి క్షీణించే దశకు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ కలర్ లోకి వస్తే.. ఓవర్ టైమ్ దంతాల నష్టానికి దారి తీస్తుంది.

కాబట్టి ముందు నుంచే దంతాల పట్ల జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం బెటర్.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు