Salt Side effects: ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారా.. అంతా మీ చేతుల్లోనే ఉంది!

మన వంట గదిలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే అదే ఉప్పు. ఈ ఉప్పు లేకపోతే ఏ వంట కూడా పూర్తి కాదు. వంటకు కూడా టేస్ట్ ఉండదు. కేవలం రుచి కోసమే కాదు.. ఉప్పుతో కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఏ ఇతర వంటకాల్లో కూడా ఉప్పుని తప్పని సరిగా వాడుతూంటాం. కానీ ఏదైనా మోతాదుకు మించి వాడితే మాత్రం నష్టం తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పు విషయంలో కూడా అంతే. ఉప్పు లేని..

Salt Side effects: ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారా.. అంతా మీ చేతుల్లోనే ఉంది!
Rock Salt
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 25, 2023 | 8:15 AM

మన వంట గదిలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే అదే ఉప్పు. ఈ ఉప్పు లేకపోతే ఏ వంట కూడా పూర్తి కాదు. వంటకు కూడా టేస్ట్ ఉండదు. కేవలం రుచి కోసమే కాదు.. ఉప్పుతో కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఏ ఇతర వంటకాల్లో కూడా ఉప్పుని తప్పని సరిగా వాడుతూంటాం. కానీ ఏదైనా మోతాదుకు మించి వాడితే మాత్రం నష్టం తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉప్పు విషయంలో కూడా అంతే. ఉప్పు లేని ఆహారం తినాలంటే చాలా కష్టం. అందులోనూ హైబీపీ ఉన్న వారు ఉప్పును తగినంత తక్కువగానే తీసుకోవాలి. ఉప్పును ఎక్కువగా తింటే ఎడెమా వస్తుంది. ఉప్పు ఎక్కువగా తింటే సోడియం కూడా పెరుగుతుంది.

ఉప్పు తీసుకుంటే నాలుకపై రుచి పోతుంది:

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల దాహం అనేది ఎక్కువగా వేస్తుంది. కాబట్టి మీకు విపరీతంగా దాహం ఉంది అంటే.. అది ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నందుకు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే యూరిన్ కూడా ఎక్కువగా అవుతుంది. ఉప్పును ఎక్కువగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు.. ఇతర రుచులను గుర్తించలేవు. అంతే కాకుండా ఏది తిన్నా సహించదు. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే ఎక్కువగా తినాలనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాళ్లు, చేతుల్లో వాపులు వస్తాయి:

శరీరంలో ఉప్పు అధికంగా ఉంటే.. శరీరంలో తరచూ వాపులు కనిపిస్తాయి. ముఖ్యంగా కాలి మడమ భాగం ఉబ్బుతుంది. ఎందుకంటే శరీరంలో నీరు బాగా చేరిందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వాపులు అనేవి కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. సాల్ట్ ని ఎక్కువగా తినే వారిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఉప్పుని తినడం వల్ల బాడీలో నీరు నిలిచిపోతుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. కనుక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్య తలెత్తుతుంది.

ఉప్పును ఎంత మోతాదులో తీసుకోవాలి:

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకి రెండు గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతే రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంటే రోజుకు ఒక స్పూన్ ఉప్పు మనకు సరిపోతుంది. మరీ తక్కువగా అంటే.. 0.3 గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి.

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలు ఏంటంటే:

ఉప్పును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్త పోటు, మార్ట్ స్ట్రోక్, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత