Hair Care tips: షాంపూ చేసే ముందు ఇలా చేస్తే జుట్టు భలేగా పెరుగుతుంది!
ప్రతి ఒక్కరికి జుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకోని వారుండరు. అందుకు హెయిర్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. అయితే జుట్టు ఊడడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహారం తీసుకోకపోడం, అనారోగ్య సమస్యలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, నీటి కాలుష్యం ఇలా అనేక కారణాల జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలిపోతూ ఉంటే మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీని ఖరీదైన షాంపూలతో పాటు సెలూన్స్ కి వెళ్లి హెయిర్ కేర్ తీసుకుంటూ..

ప్రతి ఒక్కరికి జుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకోని వారుండరు. అందుకు హెయిర్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. అయితే జుట్టు ఊడడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహారం తీసుకోకపోడం, అనారోగ్య సమస్యలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, నీటి కాలుష్యం ఇలా అనేక కారణాల జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలిపోతూ ఉంటే మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీని ఖరీదైన షాంపూలతో పాటు సెలూన్స్ కి వెళ్లి హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా మంచి విషయమే అయినా.. కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టకుండా అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. అలాగే హెడ్ బాత్ చేసే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే.. హెయిర్ ని అందంగా మెరిసేలా చేస్తుంది.
ఆయిల్:
తల స్నానం చేయడానికి ముందు ఎప్పుడూ నూనె రాయాలి. నూనె రాయడం వల్ల జుట్టు అనేది తేమగా ఉంటుంది. దీంతో జుట్టు పొడిబారిపోదు. అందుకే షాంపూతో తల స్నానం చేసే ముందు కొబ్బరి నూనె లేదా ఆలీవ్ ఆయిల్ తో జుట్టుకి మసాజ్ చేయండి. తర్వాత షాంపూ చేస్తే జుట్టు షైనీగా మెరుస్తుంది.
దువ్వడం:
తల స్నానం చేసే ముందు జుట్టుని దువ్వుతూ ఉండాలి. ఎలాంటి చిక్కులు లేకుండా దువ్వితే.. హెడ్ బాత్ చేసేటప్పుడు చిక్కులు పడకుండా ఉంటాయి. సన్నగా ఉండే దువ్వెనతో కాకుండా.. కాస్త వెడల్పుగా ఉండే పండ్ల దువ్వెనతో జుట్టును బాగా దువ్వాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
గోరు వెచ్చని నీరు:
తల స్నానం చేసే ముందు షాంపూని నేరుగా తలపై పెట్టకుండా ముందు గోరు వెచ్చని నీటితో లేదా చల్లని నీటితో తలను మొత్తం తడపాలి.
షాంపూని నేరుగా వాడకండి:
చాలా మంది షాంపూని నేరుగా తలపై రాస్తారు. ఇలా కాకుండా మీరు తీసుకునే షాంపూని కొద్దిగా మగ్గులో వేసి, వాటర్ వేసి నురగలా వచ్చేలా చేయాలి. ఇలా తల స్నానం చేస్తే జుట్టు సిల్కీగా ఉండటమే కాకుండా.. పొడి బారకుండా సాఫ్ట్ గా ఉంటుంది.
షాంపూని తక్కువగా వాడండి:
జుట్టుకి షాంపూని వాడేటప్పుడు.. మీకు సరిపోయే దాన్ని ఎంచుకోండి. ఎక్కువగా షాంపూ వేస్తే జుట్టు బలహీనమై, పొడిబారి పోతుంది. దీంతో త్వరగా జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. తలకు షాంపూ నురగ పోయేంత వరకూ నీటితో క్లీన్ చేయండి.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.