Vastu Tips: మనీ ప్లాంట్ ని పెంచే విషయంలో ఈ పొరపాట్లను అస్సలు చేయకండి!

మనీ ప్లాంట్.. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కను ఆర్థిక స్థోమత కోసం, అందం కోసం పెంచుకుంటున్నారు. ఇంట్లో సులభంగా పెంచుకోదగిన వాటిల్లో ఈ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క చిన్న చిన్న కుండీల్లో కూడా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. చాలా మంది ఈ మొక్కను అదృష్టంగా భావిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని..

Vastu Tips: మనీ ప్లాంట్ ని పెంచే విషయంలో ఈ పొరపాట్లను అస్సలు చేయకండి!
Money Plant
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 24, 2023 | 4:30 PM

మనీ ప్లాంట్.. ఈ మొక్క గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కను ఆర్థిక స్థోమత కోసం, అందం కోసం పెంచుకుంటున్నారు. ఇంట్లో సులభంగా పెంచుకోదగిన వాటిల్లో ఈ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క చిన్న చిన్న కుండీల్లో కూడా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. చాలా మంది ఈ మొక్కను అదృష్టంగా భావిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. అందరి ఇళ్లలోనూ ఈ మొక్క అంత సులభంగా పెరగదు. కొందరి ఇళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పెరుగుతుంది. ఈ మొక్కను పెట్టే విషయంలో కూడా కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి. వీటిని పాటిస్తే ఇంట్లో కూడా.. పలు సమస్యలు పోతాయి. మరి మనీ ప్లాంట్ నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలా చూసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈశాన్యంలో పెట్టకూడదు:

చాలా మందికి తెలియక మనీ ప్లాంట్ ని ఎక్కడ పడితే అక్కడ పెడుతూంటారు. ఇది చాలా తప్పని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనీ ప్లాంట్ ని ఈశాన్య దిశలో నాటకూడదు. ఈ దిశలో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి.

ఇవి కూడా చదవండి

ఆగ్నేయంలో ఉంచాలి:

మనీ ప్లాంట్ ని ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది. ఈ మొక్కను లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మనీ ప్లాంట్ తీగలు కింద తాకకుండా చూడాలి. ఎందుకంటే ఈ మొక్క తీగల రూపంలో ఉండి చాలా వేగంగా పెరుగుతుంది. అదే విధంగా ఈ మొక్క ఎల్లప్పుడూ ఆకు పచ్చగా ఉండేలా చూసుకోండి.

ఎండిపోకుండా చూడండి:

కొందరి ఇళ్లల్లో ఈ మొక్క పెరగదు. అలాగే ఎండి పోతూ ఉంటుంది. కాబట్టి ఈ మొక్క ఎండిపోకుండా జాగ్రత్తలు పాటిచండి. మనీ ప్లాంట్ ఎండిపోతే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు. అలాగే ఎండిన ఆకులను కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి.

ఇంటి లోపల పెంచుకుంటే బెటర్:

మనీ ప్లాంట్ పెరగడానికి పెద్దగా సూర్య రశ్మి అవసరం లేదు. ఇంట్లో కూడా సులభంగా పెరుగుతుంది. కాబట్టి ఈ మొక్కను ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఈ మొక్కకు ఎండ ఎక్కువగా తగిలితే ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎదుగుదల కూడా ఉండదు.

మనీ ప్లాంట్ ని ఇతరులకు ఇవ్వకూడదు:

మనీ ప్లాంట్ ని ఇతరులకు స్వయంగా ఇవ్వకూడదు. అలా చేస్తే శ్రేయస్సు తగ్గడంతో పాటు చేసిన పుణ్యాలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.