Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimer Risk: జీర్ణ సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే అల్జీమర్స్ రావచ్చు!

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో అల్జీ మర్స్ వ్యాధి కూడా ఒకటి. మెల్లగా మతి మరుపుతో మొదలయ్యే ఈ వ్యాధి తీవ్రతరం అయితే అల్జీ మర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మతి మరుపు అంటే హడావిడిలో ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ పదే పదే మనం చేసిన పనులు, వస్తువులు మర్చిపోతే మాత్రం అల్జీ మర్స్ కు దారి తీస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఈ వ్యాధికి ఇంకా చికిత్సను కనుగొనలేదు. 2030 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిపై ప్రభావాన్ని..

Alzheimer Risk: జీర్ణ సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే అల్జీమర్స్ రావచ్చు!
Stomach
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 24, 2023 | 5:30 PM

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో అల్జీ మర్స్ వ్యాధి కూడా ఒకటి. మెల్లగా మతి మరుపుతో మొదలయ్యే ఈ వ్యాధి తీవ్రతరం అయితే అల్జీ మర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మతి మరుపు అంటే హడావిడిలో ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ పదే పదే మనం చేసిన పనులు, వస్తువులు మర్చిపోతే మాత్రం అల్జీ మర్స్ కు దారి తీస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఈ వ్యాధికి ఇంకా చికిత్సను కనుగొనలేదు. 2030 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిపై ప్రభావాన్ని చూపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల జీర్ణ వ్యవస్థ స్థితికి, అల్జీ మర్స్ రావడానికి మధ్య సంబంధంపై నిపుణులు అధ్యయనం చేశారు.

తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి:

ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన అధ్యయనం నుండి సంచలనాత్మక విషయాలు వెలువడ్డాయి. దాదాపు 4 లక్షల మంది వ్యక్తులపై ఈ పరిశోధనలు చేశారు. ఈ ప్రత్యేకమైన అధ్యయనంలో అల్జీమర్స్, జీర్ణ వ్యవస్థ సమస్యల మధ్య జన్యు బంధమైన సంబంధాన్ని విశ్లేషించారు. జీర్ణ క్రియ ఆరోగ్యం ఏదో ఒక పద్దతిలో అల్జీమర్స్ ను ప్రభావితం చేయగలదని సూచిస్తున్నప్పటికీ.. స్పష్టంగా ఆధారాలు ఇంకా లేవు. మెదడు మొక్క అభిజ్ఞా, భావోద్వేగ కేంద్రాల మధ్య లింక్.. ప్రేగుల పని తీరుపై ప్రభావం చూపిస్తాయని ఆ అధ్యయనం చెబుతోంది. కాబట్టి తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మెదడుకు పదును పెట్టే గేమ్స్ ఆడాలి:

సాధారణంగా అల్జీ మర్స్ 65 ఏళ్ల తర్వాత కొంత మందికి మాత్రమే వస్తుంది. ఇలా జ్ఞాపక శక్తిని మరచిపోయే వాళ్లు మెదడుకు, శరీరానికి పదును పెట్టే కార్యకలాపాలు చేస్తూ ఉండేలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో సమయం గడుపుతూ, ఆరోగ్యకరమైన ఆహారన్ని తీసుకోవడం వల్ల అల్జీ మర్స్ ని దూరం పెట్టవచ్చు. మంచి ఆహారం తినడం వల్ల జ్ఞాపక శక్తిని బూస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. లేదంటే అల్జీ మర్స్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

బ్రెయిన్ ని యాక్టీవ్ గా ఉంచే ఫుడ్స్ తినాలి:

నట్స్, గింజలు, ప్రోటీన్, ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నట్స్ లో వాల్ నట్స్, బాదం, వేరు శనగలు, గుమ్మడి కాయ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి తీసుకుంటే.. బ్రెయిన్ యాక్టీవ్ గా ఉంటుంది. అదే విధంగా బచ్చలి కూర, బ్రోకలీ వంటి వాటిల్లో కూడా విటమిన్ ఐ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇలాంటివి తినడం వల్ల మెదడు మొద్దు బారిపోకుండా కాపాడతాయి.

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.