Vijayadashami: దసరా నుంచి 7 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకునే ప్రాంతం.. విదేశాల నుంచి సైతం పర్యాటకులు

ఈ జాతర కులులోని ధోల్‌పూర్ మైదానంలో నిర్వహిస్తారు. దసరా నుంచి మొదలయ్యే ఈ జాతర ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో స్థానిక ప్రజలు తమ సంప్రదాయ నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఏడు రోజుల పాటు జరిగే కులు దసరా ప్రజల సంస్కృతికి, మత విశ్వాసానికి ప్రతీక. ఈ సందర్భంగా సుమారు 100 మంది దేవతలు భూమిపైకి వచ్చి భాగస్వామ్యమవుతారని ఉత్సవాల్లో పాల్గొనే ప్రజలు విశ్వసిస్తారు.

Vijayadashami: దసరా నుంచి 7 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకునే ప్రాంతం.. విదేశాల నుంచి సైతం పర్యాటకులు
Kullu Dussehra
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2023 | 3:44 PM

దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు దసరా పండుగను జరుపుకుంటున్నారు. అయితే ఈ విజయదశమితో దేవి నవరాత్రి ఉత్సవాలు ముగిస్తే.. దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం విజయదశమితో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతుంది. విజయదశమితో దసరా ఉత్సవాలు హిమాచల్‌ ప్రదేశ్ లోని ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంలో సుమారు 7 రోజుల పాటు జరిగే కులు దసరా గురించి ఈ రోజు తెలుసుకుందాం. స్థానిక ప్రజలు తమ ఆచారాలు, సంప్రదాయాలతో ఈ పండుగను జరుపుకుంటారు. దసరా ప్రారంభం కావడంతో కులులో భిన్నమైన శోభ కనిపిస్తోంది. మేఘనాథుడు, కుంభకర్ణుడు, రావణుడి దిష్టి బొమ్మలను ఇక్కడ దహనం చేయరు. అయితే స్థానికులు తమ ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు. ఈ రోజు కులు దసరాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం..

కులులో దసరా ఉత్సవాలు

హిమాచల్‌లోని కులులో ఈరోజు అక్టోబర్ 24 నుండి దసరా ప్రారంభమైంది. ఇక్కడి ప్రజలు తమ ప్రభువు రఘునాథుని రథయాత్రను నిర్వహిస్తారు. డప్పుల ధ్వనులతో ప్రజలు తమ దైవానికి స్వాగతం పలుకుతారు. ఈ ఉత్సవాలను జరుపుకునే సమయంలో తమ సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తారు. ఈ సమయంలో, డప్పులు, వేణువు వంటి వాయిద్యాలతో దేవుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

సాంప్రదాయ నృత్యంతో స్థానికులు

ఈ సమయంలో స్థానిక ప్రజలు తమ సంప్రదాయ నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఏడు రోజుల పాటు జరిగే కులు దసరా ప్రజల సంస్కృతికి, మత విశ్వాసానికి ప్రతీక. ఈ సందర్భంగా సుమారు 100 మంది దేవతలు భూమిపైకి వచ్చి భాగస్వామ్యమవుతారని ఉత్సవాల్లో పాల్గొనే ప్రజలు విశ్వసిస్తారు.

ఇవి కూడా చదవండి

ఉత్సవాల జరుపుకోవడం వెనుక చరిత్ర

ఈ జాతర కులులోని ధోల్‌పూర్ మైదానంలో నిర్వహిస్తారు. దసరా నుంచి మొదలయ్యే ఈ జాతర ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పండుగ 1662 సంవత్సరంలో ప్రారంభమైందని నమ్ముతారు.ఈ ఉత్సవాల ప్రారంభం వెనుక ఉన్న చరిత్ర అతి పురాతనం. దసరా దేవతలు పండుగ మొదటి రోజున కులుకు వస్తారు.

ప్రధాన దైవం రఘునాథుడు

పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. 1650లో ఈ ప్రదేశాన్ని ఏలే రాజు జగత్ సింగ్ అనారోగ్యం బారిన పడ్డాడు. తన చికిత్స కోసం బాబా పేహరి సహాయం తీసుకున్నాడు. అప్పుడు రఘునాథుని విగ్రహాన్ని తీసుకువచ్చి దాని చరణామృతాన్ని త్రాగమని రాజుకు సలహా ఇచ్చాడు. అనేక కష్టనష్టాలకు ఓర్చి ఈ విగ్రహం కులుకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత రాజు సకల దేవతామూర్తులకు ఘనంగా స్వాగతం పలికారు. అప్పటి నుండి రఘునాథుడుని ప్రధాన దైవంగా భావిస్తారు. దీంతో పాటు దసరా నుంచి అమ్మవారిని తీసుకొచ్చే సంప్రదాయం కొనసాగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..