AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తున్నారా.. ఈ డేంజర్ నుంచి మిమ్మల్నెవ్వరూ కాపాడలేరు

రోజంతా పాజిటివ్ గా సంతోషంగా ఉండటం ఓ కళ. దీన్ని సాధించగలిగితే ఎంత పెద్ద పనైనా ఈజీగా చక్కబెట్టేయవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల రోజును మొదలు పెట్టడమే నీరసంగా, నిరాశగా అనిపిస్తుంటే అది మీ తప్పిదమే. మీరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మొదట చూసే వస్తువుల ప్రభావం మీ రోజుపై కచ్చితంగా ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వాటి వల్ల కలిగే అనర్థాలేంటో చూడండి.

Vastu Tips: నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తున్నారా.. ఈ డేంజర్ నుంచి మిమ్మల్నెవ్వరూ కాపాడలేరు
Not To See Things After Wakeup
Bhavani
|

Updated on: Apr 01, 2025 | 11:20 AM

Share

“ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరి ముఖాన్ని మొదట చూశానో…” అనే సామెతను తరచూ వినే ఉంటాం. దేవుడిని, వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారు ఈ మాటలను గట్టిగా విశ్వసిస్తారు. ఈ సందర్భంలో, వాస్తు నిపుణులు కొన్ని ముఖ్యమైన సలహాలను అందిస్తున్నారు. ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే కొన్ని వస్తువులను చూడకూడదని, కొన్ని పనులు చేయకూడదని వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేవగానే చేయకూడని పనులు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని విషయాలను నివారించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటంటే:

అద్దంలో ముఖం చూడటం:

చాలా మందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం లేదా జుట్టు దువ్వుకోవడం అలవాటుగా ఉంటుంది. కానీ, ఇది చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, దురదృష్టాన్ని తెస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బదులుగా, స్నానం చేసి, పూజ చేసిన తర్వాతే అద్దం చూడాలని సలహా ఇస్తున్నారు.

పాడైన గడియారాలు:

ఉదయం లేచిన తర్వాత సమయం తెలుసుకోవడానికి గోడ గడియారం వైపు చూడటం సహజం. అయితే, పాడైన లేదా విరిగిన గడియారాలను చూడటం అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటివి చూస్తే చెడు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

హింసాత్మక చిత్రాలు:

ఇంటి గోడలపై అలంకరణ కోసం వేసే పెయింటింగ్స్‌లో అడవి జంతువులు, యుద్ధ దృశ్యాలు లేదా హింసను సూచించే చిత్రాలు ఉంటే, వాటిని ఉదయం చూడటం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు.

సొంత నీడ:

ఉదయం లేచిన తర్వాత తమ నీడను చూడటం కూడా అశుభమని, ఆ రోజు పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యోదయ సమయంలో పడమటి దిశలో నీడ చూడటం రాహువుతో సంబంధం కలిగి ఉంటుందని, ఇది ముఖ్య నిర్ణయాలు లేదా ఆర్థిక విషయాలను వాయిదా వేయాలని సలహా ఇస్తున్నారు.

ఎంగిలి గిన్నెలు:

ఉదయం లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్లి, రాత్రి మిగిలిన గిన్నెలను శుభ్రం చేయడం కొందరి అలవాటు. కానీ, రాత్రి తిని వదిలేసిన గిన్నెలను ఉదయం చూడటం దారిద్ర్యాన్ని తెస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. బదులుగా, ఉదయం మొదట చేతులను చూసి భూదేవికి నమస్కరించాలని సూచిస్తున్నారు.

ఈ సూచనలు వాస్తు శాస్త్రంలోని నమ్మకాల ఆధారంగా రూపొందినవి. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, దైనందిన జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మేవారు ఈ సలహాలను అనుసరిస్తారు.