కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఆసక్తి ఉన్న భక్తులు ఎలా నేర్చుకోవాలంటే..
శ్రీ ఆది శంకరాచార్యులు సాక్షాత్తు పరమ శివుని అవతారమని నమ్మకం ఉంది. శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. ఆయన సమస్త మానవాళికి అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి యావత్ భారత దేశంలో ఆది శంకర మఠాలను స్థాపించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటువంటి ఆదిశంకర మఠం తెలంగాణ సికింద్రాబాద్ లో కూడా ఒకటి ఉంది. ఇక్కడ ప్రతి రోజూ పుజాదికర్యక్రమలను నిర్వహిస్తారు. అంతేకాదు పండగలు, పర్వదినాలతో పాటు వివిధ సందర్భాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఇలలో నడిచిన దైవంగా ఖ్యాతిగాంచిన శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీ ఆది శంకరాచార్యులు బోధించిన వేద సంప్రదాయాలను వివిధ కార్యక్రమాల ద్వారా సమాజానికి అందించడానికి ఆదిశంకర మఠం నిరంతరం కృషి చేస్తోంది. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని భావి తరాలకు అందిస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన దైవిక జ్ఞానం, తత్వాలను ప్రచారం చేస్తూ.. ప్రజలకు ఆధ్యాత్మికత గొప్పదనాని అందించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠం.
తాజాగా ఈ కాలడి శ్రీ ఆదిశంకర మఠం శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన కృతులను మానవాళిని అందించేందుకు ప్రత్యేక అధ్యయన తరగతులను నిర్వహించనుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి శ్రీ ఆదిశంకరాచార్యుల కృతుల శంకర గీతం ప్రత్యేక అధ్యయన తరగతులు ప్రారంభంకానుంది. ఈ అధ్యయన తరగతులు వారంలో రెండు రోజులు నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక గురూజీ సంధ్య మల్లాది నేతృత్వంలో ప్రతి బుధవారం, శనివారం సాయంత్రం 05:00 గంటలకు శంకర గీతం ప్రత్యేక అధ్యయన తరగతులు నిర్వహించనున్నాయి. శంకరాచార్య రచించిన కృతులు నేర్చుకోవాలంటే ఆసక్తి ఉన్న భక్తులు తమ పారాయణాన్ని రికార్డ్ చేసి మర్నాడు సాయంత్రం 5 గంటలలోపు జప మండపం వాట్సాప్ గ్రూప్‌లో సమర్పించవచ్చు.
శంకర గీతం ప్రత్యేక అధ్యయన తరగతులలో పాల్గొనాలనే ఆసక్తి కల భక్తులు పాల్గొనడానికి https://chat.whatsapp.com/E8BJI1esINpDPLCm3oOYUu లింక్‌ను క్లిక్ చేయండి. ఈ తరగతుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఏదైనా సహాయం కోసం 8350903080 కి ఫోన్ చేయవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి