Chamundi Devi Temple: పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత.. 1500 ఏళ్ల క్రితం ఆలయం నిర్మాణం.. దివ్య కాంతి దర్శనం కోసం భారీగా పోటెత్తిన భక్తులు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉన్న చాముండా దేవి ఆలయంలో రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతుంది. అతి పురాతనమైన అమ్మవారి ఆలయంలో పండగలు పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 1500 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని పృథ్వీరాజ్ చౌహాన్ స్థాపించాడని నమ్ముతారు. నవరాత్రి సమయంలో.. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలా దేవి ఆలయం నుంచి ఈ ఆలయానికి దివ్య కాంతి ( దైవిక కాంతి)ని తీసుకువస్తారు. ఈ అరుదైన ఘనను దర్శించుకునేందుకు భారీగా భక్తగణం చేరుకుంటారు.

పండగలు, ప్రత్యేక రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ముఖ్యంగా చైత్ర నవరాత్రులు, గుప్త నవరాత్రులు, దసరా శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కూడా ఒక అమ్మవారి ఆలయం ఉంది. మొహల్లా హల్లు సారాయ్‌లో ఉన్న ఈ ఆలయం చాముండా దేవి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల క్రితం పృథ్వీ రాజ్ చౌహాన్ ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్మకం. చాముండా దేవి చౌహాన్ రాజవంశం కుల దేవత అని నమ్ముతారు. ప్రతి నవరాత్రికి హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలా దేవి ఆలయం నుంచి దివ్య కాంతిని ఈ ఆలయానికి తీసుకువస్తారు. ఈ దివ్య కాంతిని, అమ్మవారి విగ్రహాన్ని దర్శిచుకునేందుకు, పూజించడానికి భక్తులు పోటెత్తుతారు.
ఈ ఏడాది కూడా చైత్ర నవరాత్రి మొదటి రోజు ఆదివారం ఉదయం నుండే అమ్మవారి దర్శనం భక్తులు బారులు తీరారు. స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుని పూజించడానికి ఆలయానికి చేరుకున్నారు. చైత్ర నవరాత్రులలో చాముండా అమ్మవారిని దర్శించుకుని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఈ నవ రాత్రుల్లో అమ్మవారు అలంకారం అపురూపంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, అలంకరణ వస్తువులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.
పృథ్వీరాజ్ చౌహాన్ కులదేవి ఆలయం
ఆలయ మహంత్ మురళీ సింగ్ ప్రకారం ఈ ఆలయం చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ వంశం కుల దేవత. ఇది ఒక సిద్ధ పీఠం. సంభాల్ నగరం స్థాపించబడినప్పటి నుంచి ఈ ఆలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో ఒక దివ్య జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర, శారదయ నవరాత్రుల సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలా దేవి ఆలయం నుంచి దివ్య కాంతిని ఇక్కడికి తీసుకువస్తారు. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు పూజల కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నప్పటికీ.. అమ్మవారి నవరాత్రి రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అన్నారు.
పొట్టి దుస్తులు ధరించడం నిషేధం
ఆలయ నిర్వాహకులు భక్తులు పొట్టి లేదా అసభ్యకరమైన దుస్తులు ధరించి ఇక్కడికి రావద్దని అభ్యర్థించారు. దీనికి సంబంధించి ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రదేశాలలో పోస్టర్లు కూడా అతికించబడ్డాయి. అందులో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయానికి రావాలని స్పష్టంగా రాసి ఉంది. పొట్టి దుస్తులు ధరించిన వారిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంభాల్ పరిపాలన అధికారులు ఈ తీర్థయాత్ర స్థలాలు. ఆధ్యాత్మిక గుర్తులు, బావుల కోసం వెతుకుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి